బిజినెస్

పసిడి పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 13: బులియన్ మార్కెట్ బుధవారం లాభాల బాటలో పరుగులు తీసింది. పది గ్రాముల బంగారం ధర ఏకంగా 235 రూపాయలు పెరగడంతో, 33,385 రూపాయలకు చేరింది. వెండి కూడా లాభాలను ఆర్జించింది. కిలో వెండి 130 రూపాయలు పెరిగి, 39,710 రూపాయలకు చేరింది. పది గ్రాముల బంగారం 33,150 రూపాయల వద్ద మొదలైన ట్రేడింగ్ మొదటి నుంచే సానుకూల వాతావరణంలో నడించింది. అటు విదేశీ మదుపరుల నుంచి, ఇటు సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ పెరగడంతో, ఏ దశలోనూ ధర పతనం కాకుండా పెరుగుతూనే వెళ్లింది. నగల తయారీదారుల నుంచి కూడా డిమాండ్ రావడం, అంతర్జాతీయ బులియన్ మార్కెట్ సూచీలు కూడా అనుకూలించడం బంగారం ధర పెరగడానికి కారణమయ్యాయి. మొత్తం మీద గత రెండు రోజుల్లో అనిశ్చితిలో కొనసాగిన బులియన్ మార్కెట్ బుధవారం కుదుటపడింది. ప్రపంచ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,300 డాలర్లకుపైగా పలికింది. పసిడి 1,304.31 డాలర్ల వరకూ వెళ్లగా, వెండి ధర స్వల్పంగా (15.43 డాలర్లు) తగ్గింది. మొత్తం మీద బుధవారం నాటి బులియన్ మార్కెట్ లాభసాటిగానే ముగిసింది.