బిజినెస్

ఏపికి వరం.. కెజి బేసిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 15: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా-గోదావరి బేసిన్ (కెజి బేసిన్) ఓ వరంగా మారింది. ఇక్కడి వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకున్న పక్షంలో ఆంధ్రప్రదేశ్ నిజంగానే స్వర్ణాంధ్రగా మారే అవకాశాలున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. చమురు, సహజవాయు నిక్షేపాలకు కేంద్రంగా ఉన్న కెజి బేసిన్‌లో గ్యాస్ హైడ్రేట్ల రూపంలో వనరులు పుష్కలంగా ఉన్నట్టు ఇటీవల శాస్తవ్రేత్తలు ప్రకటించడంతో సంబంధిత వర్గాల్లో ఈ అంశం తీవ్ర ఆసక్తి రేపుతోంది. అపారమైన ఈ గ్యాస్ హైడ్రేట్ నిల్వలను సద్వినియోగం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశానికి కూడా పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని స్పష్టమవుతోంది.
దేశంలో గ్యాస్ హైడ్రేట్ల అనే్వషణను ప్రభుత్వరంగ సంస్థ చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఒఎన్‌జిసి) ఆధ్వర్యంలో 2014 సెప్టెంబరులో అమెరికా భూవిజ్ఞాన సర్వే, ది జపనీస్ డ్రిల్లింగ్ కంపెనీ, జపాన్ ఏజన్సీ ఫర్ మెరైన్ ఎర్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలకు చెందిన అంతర్జాతీయ శాస్తవ్రేత్తల బృందం ప్రారంభించింది. సముద్ర తవ్వకం, సంప్రదాయ అవక్షేప కోరింగ్, పీడన కోరింగ్ వంటి చర్యల ద్వారా ఈ అనే్వషణ నిర్వహించారు. అనే్వషణలో భాగంగా బంగాళాఖాతంలోని కృష్ణా-గోదావరి బేసిన్‌లో గరుకు ఇసుకను నిక్షిప్తం చేసుకునే భూమి పొరల్లో గ్యాస్ హైడ్రేట్ల నిల్వలు భారీగా ఉన్నట్టు గమనించారు. వివిధ దశల్లో ఈ గ్యాస్ హైడ్రేట్ల నిల్వల నుండి సహజవాయువును ఉత్పత్తి చేయవచ్చని ప్రకటించారు. అయతే ఈ ప్రక్రియలో పలు సాంకేతిక సవాళ్ళు ఎదురవుతాయని కూడా నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇసుక నిక్షేపాల్లో పుష్కలంగా ఉన్న హైడ్రేట్ల నుండి సహజవాయువును ఉత్పత్తి చేయడమే మంచిదని ఇటీవల జరిగిన అధ్యయనాలు స్పష్టం చేశాయి.
ఇప్పటి నుండే ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెడితే రానున్న నాలుగైదు సంవత్సరాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశాలున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రపంచం దృష్టి కెజి బేసిన్ వైపు...
సుమారు దశాబ్ద కాలంగా కెజి బేసిన్ కేంద్రంగా ప్రభుత్వరంగ సంస్థలతోపాటు కార్పొరేట్ కంపెనీలు చమురు, సహజవాయు నిక్షేపాల అనే్వషణలో ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమహేంద్రవరం కేంద్రంగా కార్పొరేట్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఒఎన్‌జిసి, ఆయిల్ ఇండియాతోపాటు రాష్ట్ర ప్రభుత్వా నికి చెందిన గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జిఎస్‌పిసి), ప్రైవేట్‌రంగ సంస్థలైన కెయిర్న్ ఎనర్జీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక్కడున్నాయి. ఇటీవలి కాలంలో చమురు, సహజవాయు రంగం పరిస్థితి ఆశాజనకంగా లేదంటూ ఆయా సంస్థలు చెబుతున్న నేపథ్యంలో మళ్లీ ప్రపంచం దృష్టిని కెజి బేసిన్ గ్యాస్ హైడ్రేట్ల రూపంలో ఆకర్షిస్తోంది. హైడ్రేట్ల నుండి సహజవాయువును ఉత్పత్తి చేయడమే సులభమైన మార్గమని అధ్యయనాలు కూడా వెల్లడిస్తున్నాయ.
సహజవాయువులను విరివిగా అందించే వనరులుగా గ్యాస్ హైడ్రేట్లకు పేరుందని, ఇది రాష్ట్రానికి శుభ పరిణామమని ఓ కార్పొరేట్ సంస్థ ప్రతినిధి ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. మన దేశ పశ్చిమ, తూర్పు, అండమాన్ తీర ప్రాంతాల్లో గ్యాస్ హైడ్రేట్ల నిల్వలు సుమారు 1,894 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల మేర ఉంటాయని నిపుణులు అంచనా వేసినట్టు ఆయన పేర్కొన్నారు.

chitram కెజి బేసిన్‌లో గ్యాస్ హైడ్రేట్ల నిల్వలను గుర్తించిన ప్రదేశం