బిజినెస్

పెను ప్రమాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంకారా, మార్చి 15: టర్కీ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పతనమవుతూ, పెను ప్రమాదాన్ని సృష్టించనుంది. దేశాధ్యక్షుడు రెసెప్ టయిప్ ఎర్డోగన్ ఈ పతనాన్ని నివరించడానికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. అంతేగాక, దేశంలో నెలకొన్న ఆర్థిక, సామాజిక అంశాలు ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రత్యేకించి ఉగ్రవాదం వేళ్లూనుకుంటూ, టర్కీని ఆర్థికంగా దిగజారుస్తున్నది. అయితే, ఈ సమస్యలను పరిష్కరించలేకపోతున్న ఎర్డోగన్ ఇతరత్రా మార్గాలను అనే్వషిస్తున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ బలపడడం లేదు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే, ఆర్థిక పతనంలో సోమాలియా, జింబాబ్వే వంటి దేశాలతో టర్కీ కూడా చేసే ప్రమాదం కనిపిస్తున్నది. అత్యంత సంక్లిష్టమైన స్థితిలో దేశం కొట్టుమిట్టాడుతున్నప్పుడు వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు ఎర్డోగన్‌కు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. 81 ప్రావీన్స్‌లో, 30 మెట్రోపాలిటన్ నగరాలు, 1,351 జిల్లా మున్సిపాలిటీల పరిధిలో జరిగే ఎన్నికల్లో 1,251 మంది ప్రొవిజినల్, 20,500 మంది మున్సిపల్ కౌన్సిలర్లను ప్రజలు ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియ ఈనెలాఖరుకు ముగుస్తుంది. కాగా, ఈ ఎన్నికల్లో గెలిస్తేనే, ఎర్డోగన్ సర్కారు నిలబడుతుంది. సమయం చాలా తక్కువ కావడంతో, ఆర్థిక పతనం, తద్వారా ఎదురవుతున్న సమస్యల నుంచి దేశాన్ని ఏ విధంగా బయటపడేయాలనే విషయంపై దేశాధ్యక్షుడు మల్లగుల్లాలు పడుతున్నాడు. గత మూడు నెలల్లో ఆర్థిక ఫలితాల్లో 2.4 శాతం పతనం నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం, మూడో త్రైమాసికంలో తగ్గుదల 1.6 శాతం. ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఒక్కో త్రైమాసికానికీ పెరుగుతునే ఉన్నాయి. ఇటలీ ద్రవ్యం లీరా విలువ దారుణంగా పడిపోవడంతో, అన్ని రకాల వస్తుసేవల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. వృద్ధిరేటు 2.6 శాతం కూడా లేదని టర్కిష్ స్టాటిస్టిక్స్ ఇన్‌స్టిట్యూట్ (టీయూఐకే) నివేదిక స్పష్టం చేస్తున్నది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎర్డోగన్, అతను నాయకత్వం వహిస్తున్న జస్టిస్ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ (ఏకేపీ) పుంఖానుపుంఖంగా హామీలు గుప్పిస్తున్నా, ఎంత వరకూ ఫలితం ఉంటుందనేది అనుమానమే. ప్రస్తుత పరిస్థితులకు, ఎన్నికల సమయంలో గుప్పిస్తున్న హామీలకు ఏమాత్రం పొంతన లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు తీసుకోబోయే చర్యల గురించి ఇటు అధికార పార్టీగానీ, అటు ప్రతిపక్షాలుగానీ స్పష్టమైన ప్రణాళికలను ఇవ్వడం లేదు. స్థానిక ఎన్నికల్లో టీయూకే ఎక్కువ స్థానాలను గెల్చుకోలేకపోతే, టర్కీ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా పతనమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద సొమాలియా మాదిరి టర్కీ కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని, అల్లాడే ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి.