బిజినెస్

అమెరికా, భారత్ అంకుర కంపెనీల్లో ఏఈటీ ఫండ్ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: అమెరికా, భారత్ దేశాల్లో మీడియా, కంటెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో ఉన్న స్టార్టప్ (అంకుర కంపెనీలు) లలో పెట్టుబడులు పెడతామని అకత్సుకి ఎంటర్‌టైన్‌మెంట్ టెక్నాలజీ (ఏఈటీ) ఫండ్ ప్రకటించింది. పైపులైన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే పదికి పైగా ఒప్పందాలు ఉన్న ఈ కంపెనీ ఈ ఏడాది చివరిలోగా మరో ఐదు నుంచి ఆరు అంకుర సంస్థలలో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్, టెక్నాలజీ, కంటెంట్, మీడియా రంగాలలో తొలుత 50 మిలియన్ల యూఎస్ డాలర్లను అమెరికా, భారత్ దేశాలలో పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఎస్‌పోర్ట్సు టీమ్-్ఫజె క్లాన్, ఇన్ గేమ్ వీడియో చాట్ - బంద్, లైవ్ స్ట్రీమింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ - రిప్‌కార్డు వంటి వాటిల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఏఈటీ ఫండ్ ఇప్పుడు భారత్, అమెరికా మార్కెట్లపై వ్యాపార విస్తరణపై దృష్టి సారించింది.్భరత్‌లో వీడియో కంటెంట్, వెర్టికల్ మీడియా, వెర్టికల్ ఈ-కామర్స్, మొబైల్ గేమ్, వెర్నాకులర్ కంటెంట్, కంటెంట్ ఐపీ-బిజినెస్ రంగాల్లో తమ పెట్టుబడులను విస్తరించాలని భావిస్తున్నట్టు ఏఈటీ మేనేజింగ్ డైరెక్టర్ తొమాయా ఒగావా తెలిపారు. విస్తృత వ్యాపారాభివృద్ధికి అవకాశం గల భారత్‌లో తమ పెట్టుబడులు పెట్టే విషయం తమను ఉత్తేజపరుస్తోందని, రానున్న కాలంలో కంటెంట్ క్రియేషన్, కన్‌జంప్షన్ రంగాల్లో ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు.