బిజినెస్

ఊపిరి పీల్చుకున్న మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 15: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో శుక్రవారం నాటి లావాదేవీలు సజావుగా సాగడంతో మార్కెట్ ఊపిరి పీల్చుకుంది. చివరికి 269.43 పాయింట్లు పెరిగి, 38,024.32 పాయింట్లకు చేరింది. నిఫ్టీ కూడా 83.60 పాయింట్లు పెరిగి, 11,426.85 పాయింట్లుగా నమోదైంది. గత రెండు రోజులుగా నెలకొన్న అనిశ్చితి శుక్రవారం కూడా కొనసాగే ప్రమాదం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. అయితే, ట్రేడింగ్ సానుకూల ధోరణుల మధ్య ప్రారంభమై, మధ్యాహ్నం వరకూ లాభాల్లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత దూకుడు తగ్గడంతో, సూచీలు కింద పడడం మొదలైంది. అయితే, మొదట్లో ఊహించిన స్థాయిలో లాభాలు రాకపోయినప్పటికీ, మెరుగైన స్థితిలోనే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
బీఎస్‌ఈలో జరిగిన లావాదేశీల్లో శుక్రవారం బాగా లాభపడిన కంపెనీల్లో కోటక్ మహీంద్ర అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీ షేర్ల ధర 4.31 శాతం పెరిగింది. ఓఎన్‌జీసీ (2.84 శాతం), పవర్‌గ్రిడ్ (2.61 శాతం), టీసీఎస్ (2.59 శాతం), ఎన్‌టీపీసీ (2.50 శాతం) షేర్లు కూడా లాభాలను ఆర్జించాయి. కాగా, హెచ్‌యూఎల్ అత్యధికంగా, 2.23 శాతం ధరను కోల్పోయింది. ఎస్ బ్యాంక్ (1.92 శాతం), భారతీ ఎయిర్‌టెల్ (1.71 శాతం), ఐటీసీ (1.52 శాతం), రిలయన్స్ (1.39 శాతం) నష్టాలను ఎదుర్కొన్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈలోనూ కోటక్ మహీంద్రకు ఎదురుదెబ్బ తప్పలేదు. ఆ కంపెనీ షేర్ల ధర 4.65 శాతం పతనమైంది. ఐఓసీ (3.21 శాతం), హెచ్‌పీసీఎల్ (2.94 శాతం), పవర్‌గ్రిడ్ (2.88 శాతం), విప్రో (2.64 శాతం) కంపెనీలకు చెందిన షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. మరోవైపు హెచ్‌యూఎల్ (2.09 శాతం), ఎస్ బ్యాంక్ (1.92 శాతం), రిలయన్స్ (1.33 శాతం), ఐటీసీ (1.32 శాతం), భారతీ ఎయిర్‌టెల్ (1.30 శాతం) నష్టాలను ఎదుర్కొన్నాయి.