బిజినెస్

ఖనిజాభివృద్ధితో సర్వతోముఖాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: ఖనిజాభివృద్ధి రంగం ఆదాయ వనరుగానే కాకుండాప్రజోపయోగ, పారిశ్రామిక ప్రగతి, ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచే వనరుగా, పర్యావరణానికి సైతం భంగం కలిగించకుండా ఉండే సాధనంగా ఉపయోగపడుతోందని రాష్ట్ర స్ర్తి, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్ పేర్కొన్నారు. ఖినిజ అధారిత పరిశ్రమలపై వస్తున్న విధాన మార్పుల ప్రభావంతో ఎదురయ్యే సవాళ్లు, సాంకేతిక, సామాజిక, చట్టపరమైన అంశాలు చర్చించేందుకు ఇలాంటి సమావేశలు నిర్వహించడం మైనింగ్ ఇంజనీర్లకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గనుల పరిశ్రమల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, రాష్ట్రంలో గనుల పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం చొరవ చూపుతోందని ఆయన అన్నారు. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా, మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్, ఉస్మానియా, కాకాతీయ విశ్వవిద్యాలయాల ఆలుముని ఆఫ్ మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఖైరతాబాద్‌లోని విశే్వశ్వరయ్య భవన్‌లో ‘ఇంపాక్ట్ ఆఫ్ రీసెంట్ పాలసీస్ ఆన్ మినరల్ ఇండస్ట్రీస్’ అనే అంశంపై జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సును జగదీశ్వర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రసంగించారు. ఖనిజ పరిశ్రమల అభివృద్ధి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పించవచ్చునని వివరించారు. ఇలాంటి తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గనుల తవ్వకాన్ని పరిశ్రమగా గుర్తించడం శుభసూచకమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ గనులు, భూగర్భ శాస్త్ర విభాగం డైరెక్టర్ బీఆర్‌వీ సుశీల్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది తీసుకువచ్చిన జాతీయ గనుల విధానం ద్వారా పర్యావరణానికి ఎలాంటి హానీ కలుగకుండా గనుల పరిశ్రమలను అభివృద్ధి చేయవచ్చని తద్వారా దేశ ఆదాయానీ పెంచుకోవచ్చన్నారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు కేంద్ర గనుల శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, బొగ్గుశాఖ, ఇనుము శాఖలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి, దేశ వ్యాప్తంగా ఒకే విధానం అమలయ్యే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇది చట్టరూపాన్ని సంతరించుకునే వీలుందన్నాన్నారు. రాష్ట్రంలో ఈ గనుల విధానం చాలా బాగుందని, దీనిపై సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌లతో సమావేశమై చర్చించడం జరిగిందని వెల్లడించారు. ఈ జాతీయ సెమినార్ నిర్వహణ కమిటీ కన్వీనర్, ఎన్‌ఎండీసీ మాజీ సీఎండీ బీ.రమేష్ కుమార్, కో కన్వీనర్ డాక్టర్ వెంకట రామయ్య, ఐఈఐ తెలంగాణ చైర్మన్ జీ.రామేశ్వర రావు, కార్యదర్శి టీ.అంజయ్య, గనుల శాఖ ఇంజనీర్స్ సంఘం అధ్యక్షుడు అరుణ్ కుమార్, నిర్వహణ కమిటీ కన్వీనర్ బి.రమేశ్ కుమార్, ది ఇన్‌స్టిట్యూట్ అఫ్ ఇంజనీర్స్ ఇండియా జాతీయ అధ్యక్షుడు టీఎం గుణరాజా, ప్రొఫెసర్ రమణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.