బిజినెస్

షేర్ల అమ్మకమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: పవర్ సొల్యూషన్స్ రంగంలో వ్యాపారాన్ని విస్తరించాలన్న ఆలోచనలో ఉన్న పవరికా లిమిటెడ్‌కు ఇప్పుడు షేర్ల అమ్మకమే కీలకం కానుంది. మార్కెట్‌ను మరింతగా పెంచుకోవడంతోపాటు, ప్రస్తుతం తీవ్రంగా వేధిస్తున్న ద్రవ్య లబ్ధత సమస్య నుంచి బయటపడడానికి కూడా షేర్లను అమ్మకం అవసరమని పేర్కొంటూ, ఇందుకు అవసరమైన ప్రతిపానను సెబీకి పంపింది. డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ని అనుసరించి, షేర్లను లిస్టింగ్‌లో ఉంచడం వల్ల కంపెనీ బ్రాండ్ పేరు లక్షలాది మందికి పరిచయమవుతుంది. ఇండియన్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)లో 76,18,427 వాటాలను పవరికా లిస్టింగ్‌లోకి తెస్తుంది. ప్రమోటర్ బృందంతోపాటు ఇద్దరు ఉద్యోగుల వాటాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రమోటర్లలో నరేష్ చందర్ ఓబెరాయ్, ఖరాతిరామ్ ఖరాక్ పురీ, భరత్ నరేష్ ఓబెరాయ్ తమ వద్ద ఉన్న 58,03,229 వాటాలను అమ్మకానికి పెడతారు. అర్హతగల ఉద్యోగులు ఈవాటాలను కొనేందుకు కొన్ని షరతులను విధించాలని కూడా పవరికా అభిప్రాయపడుతున్నది. పవర్ సొల్యూషన్స్‌లో అన్ని విభాగాలు, అంశాల్లో పూర్తి స్థాయి సేవలు అందించే పవరికా భారత్‌లో విస్తారమైన మార్కెట్‌ను అంచనా వేస్తున్నది.