బిజినెస్

చర్చలకు సిద్ధమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 16: భారత్‌తో వాణిజ్య, మార్కెట్ అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు అమెరికా ప్రకటించింది. నిర్ధిష్ట ప్రతిపాదనలతో ముందుకు రావాలని భారత్‌కు సూచించింది. భారత్ నుంచి దిగుమతి అవుతున్న సుమారు 50 ఉత్పత్తులపై అమెరికా ఎలాంటి పన్నులు విధించడం లేదు. అయితే, భారత్ మాత్రం రెండుమూడు వందల రెట్లు పన్నులు వసూలు చేస్తున్నదని, ఈ విధానాన్ని ఇకపై ఉపేక్షించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ భారత్ తన పన్నుల విధానాన్ని మార్చుకోకపోతే, తాము కూడా అదే తీరులో స్పందించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. భారత్ మాత్రం అంతర్జాతీయ దిగుమతుల నిబంధనలను అనుసరించే పన్నులు వసూలు చేస్తున్నామని, ఇది కేవలం అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులకు మాత్రమే పరిమితం కాదని పేర్కొంది. మొత్తం మీద ఇరు దేశాలు తమతమ వాదనను బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు, పరిస్థితులు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో, అమెరికా ఈ ప్రతిపాదన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వాణిజ్య పరమైన అంశాలు ప్రభావాన్ని చూపుతాయని అమెరికా భావిస్తున్నది. భారత్ నుంచి చేనేత, వ్యవసాయోత్పత్తులను భారీ ఎత్తున అమెరికా దిగుమతి చేసుకుంటున్నది. భారత ఎగుమతుల రంగంలో అమెరికాదే పెద్దపీట. ఇరు దేశాలు అనేకానేక అంశాలపై పరస్పరం ఆధారపడ్డాయి. అందుకే, చైనాతో నెలకొన్న పరిస్థితులు భారత్‌తో పునరావృతం కాకుండా ట్రంప్ సర్కారు ఆచితూచి వ్యవహరిస్తున్నది. కానీ, భారత్ భారీగా పన్నులు వసూలు చేస్తున్నప్పుడు, అదే విధానాన్ని ఇక్కడ కూడా ఎందుకు అమలు చేయకూడదంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులేగాక, స్వపక్షంలోనూ పలువురులు ప్రశ్నిస్తున్నారని ట్రంప్ స్వయంగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. పరిస్థితి క్షీణించకుండా ఉండేందుకు సన్నాహాలు ప్రారంభించిన అమెరికా చర్చల ప్రక్రియను తెరపైకి తెచ్చింది. నిర్ధిష్టమైన ప్రతిపాదనలతో ముందుకువస్తే, చర్చించే వీలు ఉంటుందని వ్యాఖ్యానించింది. కాగా, అమెరికా ప్రకటనకు భారత్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.