బిజినెస్

కొనసాగిన బుల్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌లో ఈవారం బుల్ రన్ కొనసాగింది. లాభాల్లో పరుగులు తీసింది. గురువారం ఫ్లాట్‌గా ముగియడంతో కొంత ఆందోళన వ్యక్తమైనప్పటికీ, ఈవారం లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం సెనె్సక్స్ మళ్లీ కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈవారం ప్రారంభంలోనే సెనె్సక్స్ గత ఆరు నెలల గరిష్టానికి చేరుకోవడం విశేషం. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ సోమవారం 382.67 పాయింట్లు పెరగడంతో, 36,725.42 పాయింట్లకు చేరింది. అదే విధంగా జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 132.65 పాయింట్లు ఎగబాకి, 11,168.05 పాయింట్లుగా నమోదైంది. మరుసటి రోజు, మంగళవారం ట్రేడింగ్ మరింత ఊపుమీద కొనసాగింది. మొదటి నుంచి కొనుగోళ్ల డిమాండ్‌తో బుల్ రన్‌కు ఎదురులేకుండా పోయింది. చివరికి సెనె్సక్స్ 481.56 పాయింట్లు పెరిగి, 37,535.66 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 133.15 పాయింట్లు పెరగడంతో, 11,301.20 పాయింట్లకు చేరింది. బుధవారం ఆ స్థాయిలో లాభాలు లేకపోయినప్పటికీ, పేరొందిన కంపెనీల షేర్లు లాభాల్లోనే ట్రేడయ్యాయి. సానుకూల ధోరణులు కనిపించగా, 216.51 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్ 37,752.17 పాయింట్లుగా నమోదైంది. నిఫ్టీ 40.50 పాయింట్లు పెరిగి, 11,341.70 పాయింట్లకు చేరింది. అయితే, మూడు రోజుల భారీ లాభాలకు గురువారం బ్రేక్ పడింది. అమ్మకాల ఒత్తిళ్లు పెరగడంతో, ఒకానొక దశలో నష్టాలు తప్పవేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అటు మదుపరులు, ఇటు షేర్ బ్రోకర్లు ఆందోళనకు గురయ్యారు. అతి కష్టం మీద ప్రతికూల పరిస్థితులను అధిగమించిన సెనె్సక్స్ చివరికి నామమాత్రంగా, 2.72 పాయింట్లు పెరిగింది. దీనితో ట్రేడింగ్ ముగిసే సమయానికి 37,754.89 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 1.55 పాయింట్లు పెరిగి, 11,343.25 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా, లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం ఫ్లాట్ ట్రేడింగ్ నుంచి సెనె్సక్స్ బయటపడింది.
అంతర్జాతీయ సూచీలు కూడా సానుకూల ధోరణులు ప్రదర్శించడంతో, 369.43 పాయింట్లు పెరిగి, 38,024.32 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 83.60 పాయింట్లు పైకి ఎగబాకి 11,426.85 పాయింట్లకు చేరింది. మొత్తం మీద ఈవారం మార్కెట్ గణాంకాలను చూస్తే, సెనె్సక్స్ 1,352.89 పాయింట్లు, నిఫ్టీ 391.45 పాయింట్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు స్థిరంగా ఉండడం, దేశంలోనూ చెప్పుకోదగిన భారీ సంఘటనలుగానీ, పరిణామాలుగానీ చోటు చేసుకోకపోవడం ఈవారం మార్కెట్‌కు కలిసొచ్చిన అంశాలు. అదే విధంగా రూపాయి మారకపు విలువ క్రమంగా బలపడుతూ రావడం కూడా స్టాక్ మార్కెట్‌ను లాభాల్లో నడిపించింది. ముడి చమురు ధర స్థిరంగా కొనసాగి, ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో బుల్ రన్‌కు అవసరమైన సానుకూల పరిస్థితులను సృష్టించింది. స్థూలంగా చూస్తే, ఈవారం స్టాక్ మార్కెట్ లాబాలతో మొదలై, కొనసాగి, చివరికి లాభాలతోనే ముగిసింది.