బిజినెస్

12 నెలల్లో నిఫ్టీ లక్ష్యం 12,500 పాయింట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: భారతదేశంలో వచ్చేనెలలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగా స్టాక్‌మార్కెట్‌లో కొనసాగుతున్న ర్యాలీ కారణంగా రానున్న 12 నెలల కాలంలో నిఫ్టీ 12,500 పాయింట్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చునని ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మ్యాన్ సచ్స్ అంచనా వేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో దేశీయ మార్కెట్‌లోని స్థూల ఆర్థిక రంగంలో పెరుగుదల, రిచ్ వాల్యుయేషన్, పొలిటికల్ రిస్క్ వంటివాటిల్లో ఎగుడుదిగుడులను గోల్డ్‌మ్యాన్ సచ్స్ అంచనా వేసింది. ఆయా రంగాల్లో ప్రగతితో తమ అంచనా ప్రకారం ర్యాలీ వల్ల నిఫ్టీలో 8 శాతం పెరిగి 65 శాతం వరకు కోలుకుందని పేర్కొంది. భారత్‌తో రిస్క్‌తోపాటు రివార్డులు కూడా సానుకూలంగా ఉంటాయని తాము భావిస్తున్నామని ఆ సంస్థ తెలిపింది. భారతదేశంలో వచ్చే నెలలో పార్లమెంటు ఎన్నికలు జరుగనున్న అధికారం చేపట్టబోయే పార్టీ అనుసరించబోయే విధివిధానాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు, ఒడిదుడుకులు చోటుచేసుకుంటాయని ఆ సంస్థ అభిప్రాయపడింది. అంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయన్న అభిప్రాయాన్ని ఆ సంస్థ బలంగా నమ్ముతోంది. విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపడం వల్ల ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మూడో క్వార్టర్‌లో స్టాక్ మార్కెట్‌లో ఎదురైన ఒడిదుడుకులను తాము అంచనా వేశామని ఆ సంస్థ పేర్కొంది. అయితే, దేశంలో జరిగే సా ర్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వా న్ని ఏర్పాటు చేసే పార్టీ తీసుకునే నిర్ణయాలు స్టాక్ మార్కెట్‌పై మరింత తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని తెలిపింది. గత నెల రోజుల్లో విదేశీ ఇనె్వస్టర్లు 4.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారని, దేశంలో స్థిరమైన ప్రభుత్వం వస్తుందనే నమ్మకంతోనే వారు ముందుకు సాగారని ఆ సంస్థ పేర్కొంది.