బిజినెస్

వ్యాపార విశే్లషకులకు పెరుగుతున్న డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 20: వ్యాపార విశే్లషకులకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. కోల్‌కతాలోని ఎస్‌ఐఎస్, ఐఐఎంలో, ఖరగ్‌పూర్‌లోని ఐటీ లో కోర్సు పూర్తి చేసిన వారికి భారీ జీతాలు ఇచ్చేందుకు కార్పొరేట్ సంస్థ లు ముందుకొస్తున్నాయి. 2017- 2019 విద్యా సంవత్సరంలో కోర్టును పూర్తి చేసిన వారికి, అంతకు ముందు బ్యాచ్ వారితో పోలిస్తే 11 శాతం జీ తం అధికంగా ఆఫర్ చేస్తున్నారు. ఐఎస్‌ఐ, ఐఐఎం, ఐఐటీతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ బిజినెస్ అ నలిటిక్స్ ప్రోగ్రామ్ (పీజీడీబీఏ)ని కూ డా పూర్తి చేసిన 52 మంది విద్యార్థులకు 35 సంస్థల నుంచి 66 ఆఫర్ లెటర్లు వచ్చినట్టు ఐఐటీ ఖరగ్‌పూర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. సగటున ఒక్కొక్కరికీ ఏడాదికి రూ. 24.40 లక్షల ప్యాకేజీ లభిస్తున్నట్టు పే ర్కొంది. అత్యల్పంగా రూ.22.89 లక్షలు, అత్యధికంగా రూ.25.05 లక్షల ఆఫర్ వచ్చిందని పేర్కొంది. ఆఫర్లు ఇచ్చిన సంస్థల్లో అమెజాన్, పీడబ్ల్యూసీ, బార్క్‌లేస్, గార్ట్‌నర్, జాన్సన్ అండ్ జాన్సన్, మాస్టర్ కార్డ్ వంటివి ఉన్నాయని వివరించింది.