బిజినెస్

పన్ను ఎగవేసే ఎంఎన్‌సీలకు కళ్లెం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: సీమాంతర పన్ను ఎగవేతలను నిరోధించడానికి భారత్, అమెరికా ప్రభుత్వాలు బుధవారం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం బహుళ జాతీయ కంపెనీలు (ఎంఎన్‌సీలు) సమర్పించిన తమ ఆదాయాలు, చెల్లించిన పన్నుల వివరాలను ఇరు దేశాలు దేశం ప్రాతిపదికన ఇచ్చిపుచ్చుకుంటాయి. ఈ తాజా ఒప్పందంతో పాటు బైలేటరల్ కాంపిటెంట్ అథారిటి అరేంజ్‌మెంట్ వల్ల బహుళ జాతీయ సంస్థల (ఎంఎన్‌ఈల) మాతృ సంస్థలు సమర్పించిన ఆదాయాలు, చెల్లించిన పన్నులు వంటి వాటి వివరాలను ఇరు దేశాలు పంచుకుంటాయి. 2016 జనవరి ఒకటో తేది నుంచి లేదా దాని తరువాత నుంచి ఈ ఒప్పందం అమలులోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందం వల్ల అమెరికాకు చెందిన బహుళ జాతీయ కంపెనీలకు భారత్‌లో ఉన్న అనుబంధ సంస్థలు తమ మాతృసంస్థల ఆదాయాలు, అవి చెల్లించిన పన్నులు తదితర వివరాలను స్థానికంగా సమర్పించవలసిన అవసరం ఉండదు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి చైర్మన్ పీసీ మోదీ, భారత్‌లోని అమెరికా రాయబారి కెనె్నత్ జస్టర్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. బహుళ జాతీయ కంపెనీలు (ఎంఎన్‌సీలు) సమర్పించే తమ ఆదాయాలు, చెల్లించిన పన్నుల వివరాలను ఇచ్చిపుచ్చుకునేందుకు భారత్ ఇప్పటికే అమెరికాతో మల్టీలేటరల్ కాంపిటెంట్ అథారిటి అగ్రీమెంట్ (ఎంసీఏఏ)ను కుదుర్చుకుంది. ఒక ఎంఎన్‌సీ గ్రూపునకు చెందిన మాతృసంస్థ తాను ఉన్న ప్రాంతంలో నిర్దిష్టమయిన అధికార యంత్రాంగానికి దేశాల వారీగా తమ అనుబంధ సంస్థలకు కేటాయించిన ఆదాయం, అవి చెల్లించిన పన్నుల వంటి వివరాలను సమర్పిస్తుంటుంది.