బిజినెస్

అత్యుత్తమ విలాసవంతమైన హోటళ్లలో న్యూయార్క్‌లోని సహారా ప్లాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: న్యూయార్క్‌లోని సహారా గ్రూప్‌నకు చెందిన సుప్రసిద్ధ ప్లాజా హోటల్.. ప్రపంచంలోని అత్యుత్తమ విలాసవంతమైన విడిదిలలో ఒకటిగా నిలిచింది. న్యూ వరల్డ్ వెల్త్ అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని అపరు కుబేరుల్లో అత్యధికులు ఈ హోటల్‌లో విడిది చేసేందుకు ఇష్ట పడతారని తేలింది. దీనికి సంబంధించిన జాబితాలో ప్లాజా మూడో స్థానంలో ఉంది. ఇక మొదటి స్థానాన్ని న్యూయార్క్‌లోనే ఉన్న సెయింట్ రెజిస్ హోటల్ కైవసం చేసుకోగా, రెండో స్థానంలో లండన్‌లోని మాండరిన్ ఓరియంటల్ రెసిడెనె్సస్, నాలుగో స్థానంలో సీషెల్స్‌లోని ఫోర్ సెషన్స్ ప్రైవేట్ రెసిడెన్సీస్, ఐదో స్థానంలో మోనాకోలోని ఒడియన్ టవర్ రెసిడెన్సీస్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 1,50,000 మంది అపర కుబేరులున్నట్లు అంచనా. ఇందులో ఏటా 800 మందిని న్యూ వరల్డ్ వెల్త్ ఇంటర్వ్యూ చేసి వారి ఇష్టాయిష్టాలను ప్రకటిస్తుంది. రూమ్ సర్వీస్, పరిశుభ్రత, పూల్, స్పా, ఎంటర్‌టైన్‌మెంట్, డైనింగ్, బార్, భద్రత, రిసెప్షన్ తదితర సౌకర్యాల ఆధారంగా సంపన్నులు హోటళ్లను ఇష్టపడుతున్నారు. కాగా, తమ అధినేత సుబ్రతారాయ్‌ని బెయిల్‌పై జైలు నుంచి విడుదల చేసుకునేందుకు కోర్టు సూచించిన పది వేల కోట్ల రూపాయల డిపాజిట్ కోసం సహారా గ్రూప్.. ప్లాజా హోటల్‌తోపాటు న్యూయార్క్‌లోనే ఉన్న మరో లగ్జరీ హోటల్ డ్రీమ్, లండన్‌లోని ఇంకో లగ్జరీ హోటలైన గ్రాసోవర్ హౌజ్‌ను అమ్మేందుకు సిద్ధమైనది తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా సహారా గ్రూప్‌లోని రెండు సంస్థలు బహిరంగ మార్కెట్ నుంచి వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించాయన్న మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అభ్యంతరంతో రాయ్ జైలుపాలయ్యారు. ఈ వ్యవహారం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది.

chitram.. ప్లాజా హోటల్