బిజినెస్

టాటా కేపిటల్ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: టాటాగ్రూప్ కంపెనీల్లో ఒకటైన ఆర్థిక సేవల విభాగం ‘టాటా కేపిటల్’ సుమారు 100 మిలియన్ డాలర్ల విదేశీ నిధులు సమకూర్చుకోనున్నట్టు ఆదివారం నాడిక్కడ ప్రకటించింది. తమ కంపెనీకి చెందిన ఓ శాఖ ద్వారా ఈ నిధుల సమీకరణ నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. ‘ది ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్ (ఈసీబీ)’ పథకం ద్వారా టాటా కేపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ ఇందులో భాగస్వామ్యం అవుతోందని టాటా కేపిటల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ సబర్వాల్ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికే ఈ నిధుల సమీకరణ పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నామన్నారు. ఈ ‘ఈసీబీ’ నిధులు సమకూరడంతోనే మాతృ సంస్థ టాటాసన్స్ మొత్తం రెండు విడతలుగా 2,500 కోట్ల రూపాయల మూలధన అభివృద్ధి నిమిత్తం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇవ్వడం జరుగుతుందని ఆయన పీటీఐకి తెలిపారు. ఇందుకు సంబంధించి మార్పులు చేయలేని డిబెంచర్ ఇస్యూను గత సెప్టెంబర్‌లో జారీచేసి కంపెనీ 1,400 కోట్ల రూపాయల నిధులు రాబట్టడం జరిగిందని ఆయన వివరించారు. సమీకరించిన నిధులను అవసరమైన విభాగాలకు మళ్లించేలా కంపెనీ ఇప్పటికే సంబంధిత లాంఛనాలన్నీ పూర్తిచేసినట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2018 సెప్టెంబర్‌లో దేశంలో వచ్చిన ద్రవ్యలోటు సమస్య తమ కంపెనీకి ఎలాంటి ఇబ్బందులూ కల్పించలేదని సబర్వాల్ చెప్పారు. మ్యూచువల్ ఫండ్లను పరిమిత స్థాయికే నియంత్రించడం ద్వారా రిలయన్స్ తరహాలో బ్యాంకు రుణ భారాన్ని తగ్గించుకోవడానికి తమ కంపెనీ చర్యలు చేపట్టిందన్నారు. సమస్యాత్మక రోజుల్లో రుణాలపై వడ్డీరేట్లు పెరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ తదనంతర కాలంలో రేట్లు తగ్గిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2020 నాటికి కంపెనీకి చెందిన 25 నుంచి 30 శాతం రుణాలను తగ్గించుకునేందుకు కృషి జరుగుతోందన్నారు. ప్రస్తుతం 60 శాతం పెట్టుబడులు రీటెయిల్ మార్కెట్‌లోనే ఉన్నాయని, మరో 25 శాతం చిన్న, మధ్య తరహా వ్యాపారాల్లో, అలాగే 15 శాతం కార్పొరేట్, వౌలిక వసతుల రంగాల్లో ఉన్నాయని ఆయన వివరించారు.