బిజినెస్

జీఎస్‌టీ బెనిఫిట్‌ను పంపిణీ చేయని విన్ విన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: జీఎస్‌టీ బెనిఫిట్‌ను వినియోగదారులకు పంపిణీ చేయకుండా లాభాలు స్వీకరించిన కేరళకు చెందిన విన్ విన్ అప్లియెనె్సస్ అక్రమాలకు పాల్పడినట్లు జీఎస్‌టీ యాంటీ ప్రొఫిటీరింగ్ అథారిటీ గుర్తించింది. దాదాపు రూ.32,926 మేర బెనిఫిట్‌ను స్వాహా చేసిందని ఆ సంస్థ తెలిపింది. కేరళకు చెందిన స్టేట్ స్క్రీనింగ్ కమిటీ ఈ మేరకు ఫిర్యాదును దాఖలుచేసింది. మిక్చర్ గ్రైండర్‌లపై జీఎస్‌టీని 28 నుంచి 12 శాతానికి తగ్గించారు. మిక్సర్ గ్రైండర్ తయారీ సంస్థ నిర్ణయించిన రేటుకే తాను విక్రయించానని ఆరోపణలు ఎదుర్కొన్న విన్ విన్ అప్లియెనె్సస్ పేర్కొంది. విన్ విన్ సంస్థ బేస్ ధరను పెంచి విక్రయించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ యాంటీ ప్రొఫిటీరింగ్ సంస్థ పేర్కొంది. జీఎస్‌టీ రేటును తగ్గించినప్పుడు ఆ బెనిఫిట్‌ను వినియోగదారులకు ఇవ్వకుండా అవకతవకలకు పాల్పడినట్లు యాంటీ ప్రొఫిటీరింగ్ అథారిటీ పేర్కొంది. ఈ మేరకు కేసు విచారణలో ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. విన్ విన్ సంస్థ రూ.32,926ను 18 శాతం వడ్డీతో డిపాజిట్ చేయాలని ఆదేశించినట్లు యాంటీ ప్రొఫిటీరింగ్ సంస్థ పేర్కొంది. అలాగే పెనాల్టీ కూడా విధిస్తామని ఆర్డర్‌లో అథారిటీ పేర్కొంది.