బిజినెస్

మార్కెట్‌లో బుల్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 28: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో గురువారం బుల్ రన్ కొనసాగింది. సెనె్సక్స్ 400 పాయింట్లకుపైగా పెరిగితే, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ మళ్లీ 11,500 పాయింట్లను అధిగమించింది. లావాదేవీలు మొదలైన వెంటనే కొనుగోళ్లకు మదుపరులు ఆసక్తిని చూపించడంతో, మార్కెట్ శర వేగంగా ముందుకు దూసుకెళ్లింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం, ఐటీ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. 38,208.30 పాయింట్ల వద్ద మొదలైన ట్రేడింగ్ క్రమంగా బలపడుతూ వచ్చింది. ఒకటిరెండు సందర్భాలను మినహాయిస్తే, లాభాల బాటలోనే మార్కెట్ కొనసాగింది. చివరికి 412.84 పాయింట్లు (1.08 శాతం) పెరిగిన సెనె్సక్స్ 38,545.72 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 124.95 పాయింట్లు (1.09 శాతం) పెరిగి, 11,570 పాయింట్లుగా నమోదైంది. సెనె్సక్స్ పరుగు కారణంగా, హెచ్‌సీఎల్ టెక్ (3.84 శాతం), ఎస్‌బీఐ (3.36 శాతం), ఎస్ బ్యాంక్ (2.71 శాతం), యాక్సిస్ బ్యాంక్ (2.64 శాతం), సన్ ఫార్మా (2.49 శాతం), ఐటీసీ (2.39 శాతం) చొప్పున లాభాలను ఆర్జించాయి. అదే విధంగా, భారతి ఎయిర్‌టెల్ (2.21 శాతం), ఏషియన్ పెయింట్స్ (1.91 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (1.70 శాతం), టీసీఎస్ (1.54 శాతం) లాభాలను ఆర్జించాయి. షేర్లకు డిమాండ్ ఏర్పడిన కంపెనీల్లో బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ కూడా ఉన్నాయి. అయితే, టాటా స్టీల్ (1.73 శాతం), ఓఎన్‌జీసీ (1.65 శాతం), బజాజ్ ఆటో (1.56 శాతం), పవర్‌గ్రిడ్ (1.20 శాతం), మహీంద్ర అండ్ మహీంద్ర (0.71 శాతం), చొప్పున నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ విషయానికి వస్తే, ఇండియాబుల్స్ వాటాలు అత్యధికంగా 8.10 శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. జీ ఎంటర్‌టైనె్మంట్ 4.67 శాతం, అదానీ పోర్ట్స్ 3.81 శాతం, ఎస్‌బీఐ 3.30 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు ఓఎన్‌జీసీ (2.62 శాతం), హిందాల్‌కో (2.55 శాతం), టాటా స్టీల్ (1.84 శాతం), డాక్టర్ రెడ్డీస్ (1.73 శాతం), బజాజ్ ఆటో (1.05 శాతం) నష్టపోయిన కంపెనీల జాబితలో ఉన్నాయి. ఇలావుంటే, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 1,481.11 కోట్ల రూపాయల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదేవిధంగా దేశీయ మదుపరులు 134.92 కోట్ల రూపాయల మేరకు షేర్లను కొన్నారు. కాగా, డాలర్‌కు రూపాయి మారకం విలువ 11 పేసలు తగ్గింది. దీనితో ఇంట్రా-డేలో డాలర్ విలువ 68.99 రూపాయలకు చేరింది.