బిజినెస్

‘ఎంఎస్‌టీసీ’కి నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: ప్రభుత్వ రంగ సంస్థ మెటల్‌స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ (ఎంఎస్‌టీసీ) లిమిటెడ్ శుక్రవారం ఆరంభంలోనే స్టాక్ మార్కెట్‌లో బలహీనమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఈ సంస్థకు చెందిన వాటాలు 7.5 శాతం నష్టాలను చవిచూసి వాటా ధర రూ.120 నుంచి దగువకు చేరుకుంది. బీఎస్‌ఈలో తొలుత రూ.111 ఇస్యూ ధరతో ఆరంభమైన ఈ వాటాలు 7.5 శాతం నష్టాలను చవిచూశాయి. మళ్లీ 116.55 రూపాయలకు ఎగబాకి ఆతర్వాత రూ.110.05కు దిగివచ్చింది. ఇలా ఊగిసలాటకు గురై ఒకదశలో రూ.120కి చేరుకున్నా మళ్లీ రూ.111కు పడిపోయింది. కేవలం 1.46 సార్లు మాత్రమే ఈ ఇస్యూ కొనుగోళ్లు జరిగాయి. గతంలో ఈ ఇస్యూను మార్చి 15 నుంచి 20 వరకు పొడిగించి షేరు ధరను రూ.120 నుంచి 128కి పొడిగిస్తూ సవరించిన ఇస్యూను విడుదల చేయడం జరిగింది. ఐతే తొలిరోజే ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఇనుప స్క్రాప్ ఎగుమతులను పర్యవేక్షించే కోల్‌కతాకు చెందిన సంస్థ ఎక్వైరస్ కేపిటల్ ప్రైవేట్ లిమిటెడ్స్ అనే సంస్థ ఈ ఇస్యూను పర్యవేక్షించడం జరిగింది.