బిజినెస్

మార్కెట్‌లో బుల్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 30: బాంబే స్టాక్ మార్కెట్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఈవారం బుల్ రన్ కొనసాగింది. ట్రేడింగ్ లాభనష్టాల మధ్య కొనసాగినప్పటికీ, చివరికి వారం మొత్తం మీద సెనె్సక్స్ 508.30 పాయింట్లు పెరిగింది. వారం మొదటి రోజే భారీ నష్టాన్ని చవిచూసి స్టాక్ మార్కెట్ ఆ తర్వాత కోలుకుంది. 38,164.61 పాయింట్ల వద్ద సోమవారం ప్రారంభమైన సెనె్సక్స్, ఈవారం మొదటి రోజే 355.70 పాయింట్లు చేజార్చుకొని, 37,808.91 పాయింట్లకు పడిపోయింది. అయితే, మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఆటుపోట్లను సమర్థంగా ఎదుర్కొని, 424.50 పాయింట్లు సంపాదించుకుంది. ఫ లితంగా 38,233.41 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. మరుసటి రోజు, బుధవారం అంతర్జాతీయ సూచీలు ప్రతికూల ధోరణులను ప్రదర్శించడంతో, దాని ప్రభావం భా రత స్టాక్ మార్కెట్‌పైన కూడా పడింది. దేశీ య మదుపరులు ఎంతగా అండగా నిలిచినప్పటికీ ఫలితం లేకపపోయింది. చివరికి 100.53 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్ 38,132.88 పాయింట్లకు పడిపోయింది. కా నీ, గురువారం మళ్లీ పైకి ఎగిసింది. 412.84 పాయింట్లు లాభపడిన సెనె్సక్స్ 38,545.72 పాయింట్ల వద్ద ముగిసింది. లా వాదేవీలకు చివరి రోజైన శుక్రవారం కూడా మార్కెట్ లాభపడింది. 127.19 పాయింట్లు మెరుగుపడి, 38,672.91 పాయింట్లకు చేరింది.
సెనె్సక్స్‌తోపాటు నిఫ్టీ కూడా ఆటుపోట్లకు గురైనప్పటికీ, వారం మొత్తం మీద 269.65 పాయింట్లు లాభపడింది. ఈవారం ట్రేడింగ్ మొదటి రోజు, సోమవారం 102.65 పాయింట్లు నష్టపోయి, 11,354.25 పాయింట్లకు పడిపోయింది. మంగళవారం 129 పాయింట్లు లాభపడి, 11,483.25 పాయింట్లకు చేరగా, బుధవారం స్వల్పంగా, 38.20 పాయింట్లు చేజార్చుకొని, 11,445.05 పాయింట్ల వద్ద ముగిసింది. లావాదేవీలకు చివరి రెండు రోజులైన బుధ, శుక్రవారాల్లో వరుసగా 124.95 పాయింట్లు పెరిగి 11,570 పాయింట్లకు, 53.90 పాయిం ట్లు మెరుగుపడి 11,623.90 పాయింట్లకు పెరిగింది. మొత్తం మీద ఈవారం నిఫ్టీ 269.65 పాయింట్లు లాభపడింది. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధానికి త్వరలో తెరపడబోతున్నదనే వార్త ప్రచారం కావడంతోపాటు, రూపాయి మారకపు విలువ బలపడడం, అంతర్జాతీయ సూచీలు సానుకూలంగా ఉండడం, పెట్టుబడిదారుల సెంటిమెంట్లు కూడా కొనుగోళ్లకే మొగ్గు చూపడం వంటి అంశాలు అటు సెనె్సక్స్, ఇటు నిఫ్టీ పాయింట్లు పెరగడానికి తోడ్పడ్డాయి.