బిజినెస్

గతేడాది పీఈ, వీసీ పెట్టుబడులు 20.5 బిలియన్ డాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మన దేశంలో గడచిన 2018లో ప్రైవేటు ఈక్విటీ (పీఈ), వెంచర్ కేపిటల్ (వీసీ) పెట్టుబడులు 20.5 బిలియన్ డాలర్ల మేర రాగా, అందుకు సంబంధించి 786 లావాదేవీలు జరిగాయి. సాంకేతిక రంగంలో విస్తరించిన అంకుర సంస్థలు, ఈకామర్స్, సమాచార పరమైన సేవల కారణంగా ఈ పెట్టుబడు లు వచ్చాయని ‘ది అస్యూరెన్స్ అండ్ ట్యాక్స్, అడ్వయిజరీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్’ అధ్యయనం వెల్లడించింది. ఆదే రకమైన ట్రెండ్ రానున్న సంవత్సరంలోనూ కొనసాగవచ్చని నివేదిక పేర్కొంది. గడచిన ఏడాది ప్రధానంగా అంకుర సంస్థల పునరుద్ధరణ, కం ట్రోల్ డీల్స్, భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరిగాయని, అలాగే రాజుల ఐశ్వర్యానికి సంబంధించిన నిధులను భారతీయ ఆస్తులుగా మార్చుకోవడం జరిగిందని ఆ అధ్యయనం వెల్లడించింది. ప్రైవేటు ఈక్విటీ మార్కెట్లో అం కుర సంస్థలు 59 శాతాన్ని ఆక్రమించాయని, ఈ ఈక్విటీల్లో విలువ ఆధారంగానే అధికంగా పెట్టుబడులు వచ్చాయని, 26 శాతం వాల్యూమ్ ప్రాతిపదికన వచ్చాయని గ్రాంట్ థార్న్‌టన్ ఇండియా ఎల్‌ఎల్‌పీ భాగస్వామి బృం దామాథుర్ తెలిపారు. కాగా పెట్టుబడుల సైజ్ ప్రాతిపదికగా పరిశీలిస్తే 100 మిలియన్ డాలర్ల విలువైన 47 డీల్స్ కారణంగానే పీఈ, వీసీ నిధుల సమీకరణలో స్వల్ప వృద్ధి సాథ్యమైందని నివేదిక పేర్కొంది. అలాగే మరో 500 మిలియన్ డాలర్ల విలువైన మరో ఆరు డీల్స్ జరిగాయని తెలిపింది. ఈ ఎన్నికల సీజన్‌లోప్రజాధనం ఇలా పె ట్టుబడుల రూపంలోకి రావడం కొత్తే మీ కాదని, రాబోయే రోజుల్లో ఈ పె ట్టుబడులు గ్రామీణ ప్రాంతాల్లోకి, వౌ లిక వసతుల సంబంధిత రంగాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొం ది. దీర్ఘకాలిక ప్రయోజనాలు సమకూర్చేలా మధ్యతరహా మార్కెట్లలోకి అధికంగా పెట్టుబడులు రావడం వల్ల కీలక రంగాలకు ఎలాంటి ఇబ్బం దీ ఉండదని నివేదిక పేర్కొంది. 2020 వ సంవత్సరంలోప్రైవేటు ఈక్విటీలోకి పెట్టుబడులు అధికంగా వచ్చే అవకాశాలున్నాయని, ఆ ఏడాది ప్రథమార్థం తర్వాత ఈ పెట్టుబడులు పుంజుకుంటాయని నివేదిక విశే్లషించింది.