బిజినెస్

లాభాల్లోనే స్టాక్ మార్కెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఆర్థిక సంవత్సరంతోపాటు ప్రారంభం కానున్న కొత్త వారంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే నడుస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మార్కెట్ నిపుణులతోపాటు, విశే్లషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల్లో హఠాత్ పరిణామాలు ఏవీ చోటు చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఏవైనా అనుకోని ఉపద్రవాలు ఎదురైతే తప్ప స్టాక్ మార్కెట్‌కు వచ్చే వారం ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంచనా. గత వారంలో మాదిరిగానే ఈవారం కూడా సెనె్సక్స్, నిఫ్టీ సానుకూల ధోరణుల్లోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
*
ముంబయి, మార్చి 31: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ట్రేడింగ్ వచ్చే వారం కూడా లాభసాటిగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సూచీలు సానుకూల ధోరణులను ప్రదర్శించడం ఖాయమని, ఫలితంగా సెనె్సక్స్, నిఫ్టీ పెరుగుతుందే తప్ప తగ్గదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో గత వారం ఐదు రోజులు జరిగిన ట్రేడింగ్‌లో సెనె్సక్స్ 508.30 పాయింట్లు, నిఫ్టీ 269.65 పాయింట్లు పెరిగాయి. మొదటి రోజు నష్టాలను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు రెండో రోజైన మంగళవారం తేరుకున్నాయి. బుధవారం మరోసారి నష్టాన్ని చవిచూశాయి. మిగతా రెండు రోజులు, గురు, శుక్ర వారాల్లో, మార్కెట్లు లాభాల బాటలో నడిచాయి. స్థూలంగా చూస్తే, గత వారం మొత్తం బుల్ రన్ కొనసాగిందనే చెప్పాలి. అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైటిజర్, అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ ముచిన్ చైనా పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరపడవచ్చన్న వాదనకు బలాన్నిస్తోంది. చైనా ఉప ప్రధాని లియో హేతో వారు జరిపిన చర్చలు సత్ఫలితాలనిస్తాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. అయితే, ఈ చర్చల పూర్తి వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు.
ఇలావుంటే, గత వారం టాప్-10లోని ఏడు కంపెనీల మార్కెట్ విలువ గత వారం 57,402.93 కోట్ల రూపాయలు పెరిగింది. వీటిలో, ఎస్‌బీఐ అత్యధికంగా లాభపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (రిల్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్ కూడా లాభాల బాటలోనే నడిచాయి. ఎస్‌బీఐ విలువ 20,260.54 కోట్ల రూపాయల పెరగడంతో 2,86,301.54 కోట్ల రూపాయలకు చేరుకుంది. రిల్ ఎం-క్యాప్ 13,297.66 కోట్లు పెరిగి 8,63,995.66 కోట్ల రూపాయలకు ఎదిగింది.
అదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ 12,208.98 కోట్ల రూపాయలు పెరగడంతో 6,30,853.98 కోట్ల రూపాయలుగా నమోదైంది. హెచ్‌యూఎల్ విలువ 6,341.22 కోట్లు పెరిగి, 3,69,699.22 కోట్ల రూపాయలకు చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ 4,884.11 కోట్లు మెరుగుపడి, 2,57,106.11 కోట్ల రూపాయలకు ఎదిగింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ 323.64 కోట్ల లాభాలతో 2,54,865.64 కోట్ల రూపాయలకు ఎదిగింది. ఇన్ఫోసిస్ విలువ 86.78 కోట్ల రూపాయలు పెరిగి, వారాంతంలో 3,24,305.78 కోట్ల రూపాయలుగా నమోదైంది. హెచ్‌డీఎఫ్‌సీ విలువ 2,544.62 కోట్ల రూపాయలు పెరగడంతో 3,24,658.38 కోట్ల రూపాయలకు చేరింది. కాగా, టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్) విలువ 1,593.96 రూపాయలు పతనమై, 7,50,627.04 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఐటీసీ విలువ 876.40 కోట్ల రూపాయలు తగ్గి, 3,63,713.60 కోట్ల రూపాయలకు చేరింది. మొత్తం మీద టాప్-10లో ఏడు కంపెనీల వాటాలు లాభాలను ఆర్జించగా, సెనె్సక్స్ 1.33 శాతం పెరిగింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, రాబోయే వారంలోనూ స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే నడుస్తాయన్న నమ్మకం బలపడున్నది.