బిజినెస్

విజయా, దేనా పేర్లు కనుమరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరం సోమవారం నుంచి మొదలుకానుండగా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ పేర్లు గత చరిత్రగా మిగలనున్నాయి. ఈ రెండు బ్యాంక్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)లో విలీనం కావడంతో, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇవి ఉనికిని కోల్పోనున్నాయి. ఇకపై విజయా, దేనా బ్యాంక్ పేర్లు కనిపించవు. వాటిని కూడా బీఓబీగానే పేర్కొంటారు. విజయా, దేనా బ్యాంక్ ఖాతాదారులు, డిపాజిట్‌దారులు కూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఓబీ కిందికే వస్తారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. లావాదేవీలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగేందుకు వీలుగా బీఓబీకి 5,042 కోట్ల రూపాయలను ఇవ్వనుంది. అదనపు ఖర్చులను భరించేందుకు వీలుగా మూలధనాన్ని పెంచుకోవడానికి ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. సమ్మేళన విధానాన్ని అనుసరించి, విజయా బ్యాంక్‌లో ప్రతి 1,000 షేర్లకుగాను, వాటాదారులకు 402 బీఓబీ వాటాలను కేటాయిస్తారు. అదే విధంగా దేనా బ్యాంక్‌లో ప్రతి 1,000 వాటాలకు 110 బీఓబీ వాటాలను అందచేస్తారు. గత ఏడాది సెప్టెంబర్‌లో విజయా, దేనా బ్యాంక్‌లను బీఓబీలో విలీనం చేస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనితో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత దేశంలో మూడో అతిపెద్ద బ్యాంక్‌గా బీఓబీ అవతరించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల వికాసానికి, అవి మరింత మెరుగ్గా పని చేయడానికి వీలుగా ఈ సమ్మేళనానికి కేంద్రం అనుమతించింది. బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి కూడా ఈ విలీనం అనివార్యమైంది. సమస్యల్లో చిక్కుకొని అల్లాడుతున్న ఐడీబీఐ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ బ్యాంక్‌లోని 51 శాతం వాటాలను జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)కి అమ్మేందుకు అనుమతించింది. ఈ వాటాల బదిలీ ప్రక్రియ ముగియడంతో, ఐడీబీఐ బ్యాంక్‌పై ఎల్‌ఐసీ ఆజమాయిషీ మొదలైంది. కాగా, విజయా, దేనా బ్యాంక్‌ల విలీనం తర్వాత, బీఓబీ వ్యాపారం 14.82 లక్షల కోట్ల రూపాయలకు చేరనుంది. మొత్తం మీద ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌లను ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంక్ మొత్తం 1.06 లక్షల కోట్ల రూపాయలను ఆయా బ్యాంక్‌లకు అందచేసింది.