బిజినెస్

చర్చలు ఫలించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 5: అమెరికా, చైనా దేశాల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందోనని ఎదురు చూస్తున్న వారికి ఇరు దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయన్న వార్త ఊరటనిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాషింగ్టన్‌లో సమావేశమైన చైనా ఉప ప్రధాని లియూ హీ ఎంత వరకూ తమ వాదనను బలంగా వినిపిస్తాడన్న అంశం ఆసక్తిని రేపుతున్నది. తమ దేశం నుంచి దిగుమ తి చేసుకుంటున్న వస్తువులపై చైనా అధిక మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్నదని అమెరికా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అందుకు సమాధానంగా చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై అమెరికా భారీగా పెంచేసింది. ఈ చర్య తో ఆగ్రహించిన చైనా, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల డ్యూ టీ టారిఫ్‌ను మరింత పెంచింది. ఇరు దేశాలు ఒకరితో పోటీపడుతూ మరొకరు దిగుమతులపై పన్నును కొన్ని వందల రె ట్లు పెంచడంతో వాణిజ్య యుద్ధం మొదలైంది. అది తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో, ఇరు దేశాలు చర్చలకు ఉపక్రమించాయి. అయితే, రెండు దేశాల ప్రతినిధులు రెండు పర్యాయాలు సమావేశమైనప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు. నేరు గా రెండు దేశాల అధ్యక్షులు భేటీ కావాల ని చైనా నుంచి వచ్చిన ప్రతిపానను ట్రం ప్ తోసిపుచ్చారు. పరిస్థితి మరింత జటిలంగా మారిన నేపథ్యంలో, చైనా ఉప ప్రధాని లియూ అమెరికా పర్యటనకు వెళ్ల డం ప్రాధాన్యతను సంతరించుకుంది. ద్వైపాక్షిక అంశాలపై ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరపునున్నారు. అయితే, వాణిజ్య పరమైన అంశా లు, పరస్పర సహకారంపైనే దృష్టి కేంద్రీకరిస్తారని పరిశీలకుల అభిప్రాయం. మొత్తంమీద వీరి చర్చల ఫలితంపై యావ త్ ప్రపంచం ఎదురుచూస్తున్నది.