బిజినెస్

దీనార్ విలువ రూ. 233!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: కువైట్ దీనార్ విలువను భారత కరెన్సీలో అత్యధికంగా 233.05 రూపాయలుగా నిర్ధారించారు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి మారకపు విలువను ఖరారు చేశారు. దీని ప్రకారం, విదేశీ ద్రవ్య విలువ దిగుమతులకు ఎక్కువగా, దిగుమతులకు తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు కువైట్ దినార్ విలువ దిగుమతుల సమయంలో 233.05 రూపాయలుకాగా, ఎగుమతులు చేసినప్పుడు లభించేది రూ.217.35 మాత్ర మే. మిగతా విదేశీ ద్రవ్యానికి కూడా దిగుమతుల సమయంలో అధికంగా, ఎగుమతుల సమయంలో తక్కువగా రూపాయి విలువను లెక్కిస్తారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన వివరాల ప్రకారం దిగుమతులు, ఎగుమతులకు విదేశీ మార పు విలువ వరుసగా బెహ్రైన్ దీనార్ 188, 176.15 రూపాయలు, స్టెర్లింగ్ పౌండ్ 92, 88.70 రూపాయలు, యూరో 78.55, 75.65 రూపాయలు, యూఎస్ డాలర్ 69.45, 67.75 రూపాయలు, స్విస్ ఫ్రాంక్ 70.10, 67.40 రూపాయలు, వంద జపనీస్ ఎన్‌లు 62.75, 60.40 రూపాయలు, కెనడా డాలర్ 52.25, 50.45 రూపాయలు, సింగపూర్ డాలర్ 51.60, 49.80 రూపాయలు, ఆస్ట్రేలియా డాలర్ 50, 47.75 రూపాయలు, న్యూజిలాండ్ డాలర్ 47.85, 45.65 రూపాయలు, కతారీ రియాల్ 19.45, 18.25 రూపాయలు, యూఏఈ దర్హం 19.30, 18.10 రూ పాయలు, సౌదీ అరేబియా రియాల్ 18.90, 17.70 రూపాయలుగా ఖరారైంది. అదే విధంగా టర్కిష్ లీరా 12,55, 11.80 రూపాయలు, డానిష్ క్రొనర్ 10.50, 10.15 రూపాయలు, చైనీస్ యున్ 10.40, 10.05 రూపాయలు, హాంకాంగ్ డాలర్ 8.90, 8.50 రూపాయలు, నార్వేజియన్ క్రోనర్ 8.15, 7.85 రూపాయలు, స్వీడిష్ క్రోనర్ 7.55, 7.25 రూ పాయలు, కొరియా వన్ 6.25, 5.85 రూపాయలు, దక్షిణాఫ్రికా ర్యాండ్ 5, 4.70 రూపాయలుగా నిర్ధారించారు. సహజంగా ఎగుమతులు, దిగుమతుల సమయంలో, ఆయా తేదీల్లో ఉన్న మారకపు విలువలోని స్వల్ప మార్పులను కూడా పరిగణలోకి తీసుకుంటాయి. అయితే, భారీ మార్పులు చోటు చేసుకునే వరకూ ప్రస్తుతం ఖరారు చేసిన రేట్లే అధికారికంగా అమల్లో ఉంటాయి.