బిజినెస్

రూ.40,597 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో అతివిలువైన కంపెనీ టాప్‌టెన్ జాబితాలోని మూడు కంపెనీల మార్కెట్ విలువ (ఎంక్యాప్) గతవారం రూ.40,597 కోట్లమేర పెరిగింది. ఇందులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అత్యధికంగా లాభపడిన సంస్థగా నిలిచింది. మార్కెట్ కేపిటలైజేషన్ (ఎంక్యాప్)లో గడచిన శుక్రవారంతో ముగిసిన వారం రోజుల్లో టాప్‌టెన్ కంపెనీల్లో టీసీఎస్‌తోబాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌లు గణనీయంగా లాభపడ్డాయి. అదే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎఎల్), ఐటీసీ, హెయూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు నష్టాలను చవిచూశాయి. నష్టపోయిన ఏడు కంపెనీలకంటే టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌లు రూ.30,758.64 కోట్ల మేర అధికంగా లాభాలను అందుకున్నాయి. టీసీఎస్ ఎంక్యాప్ రూ.19,155.92 కోట్లు లాభపడి మొత్తం విలువ రూ.7,69,782. 96కు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ విలువ సైతం రూ.15,346.61 కోట్లు లాభపడి మొత్తం విలువ రూ.3,54,004.99 కోట్లకు చేరుకుంది. అలాగే ఇన్ఫోసిస్ రూ. 6,094.66 కోట్లు లాభపడి మొత్తం విలువ రూ.3,30,400.44 కోట్లకు ఎగబాకింది. కాగా హిందూస్ధాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్) విలువ రూ. 10,412.23 కోట్లు తగ్గిపోయి రూ. 3,54,004.99 కోట్లకు దిగివచ్చింది. ఐసీఐసీఐ బ్యాంకు విలువ సుమారు రూ.5,376.90 కోట్లు తగ్గిపోయి మొత్తం విలువ రూ. 2,51,729.21 కోట్లకు దిగివచ్చింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) రూ.5,039.26 కోట్లు నష్టపోయి మొత్త విలువ రూ.8,58,956.4 కోట్లకు పడిపోయింది. కాగా ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ రూ.4,016.88 కోట్ల నుంచి రూ.6,26,837.10 కోట్లకు చేరుకోగా ఎస్‌బీఐ విలువ రూ.3,391.35 కోట్లు నష్టపోయి మొత్త విలువ రూ. 2,82,910 కోట్లకు చేరుకుంది. మరో ప్రభుత్వ రంగ సంస్థ ఐటీసీ సైతం రూ.2,513.02 కోట్లు నష్టపోయి మొత్తం విలువ రూ.3,61,200.58 కోట్లకు దిగింది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంకు విలువ రూ.82.09 కోట్లు నష్టపోయి మొత్తం విలువ రూ.2,54,783.55 కోట్లకు దిగింది. టాప్ ర్యాంకింగ్ ఉన్న సంస్థల్లో ఆర్‌ఐఎల్ అగ్ర స్థానాన్ని ఆక్రమించింది. టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఈ వారం తదుపరి స్థానాల్లో నిలిచాయి.