బిజినెస్

పతనంతో మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 8: కార్పొరేట్ సంస్థల గత ఆర్థిక సంవత్సర ఫలితాల కోసమేగాక, రాబోయే సార్వత్రిక ఎన్నికల తీరుతెన్నులు ఎలా ఉంటాయోనన్న కారణంగా కూడా మదుపరులు జాగ్రత్త పడడంతో, ఈవారం మొదటి రోజైన సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో మొదలైంది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 161.70 పాయింట్లు పతనమై 38,700.53 పాయింట్లకు పడిపోంది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ కూడా 61.45 పాయింట్లు పడిపోవడంతో 11,604.50 పాయింట్లకు చేరింది. ఫైనాన్షిల్, మెటల్, ఎనర్జీ రంగాల్లోని కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా, ఆయిల్ స్టాక్స్ కూడా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముడి చమురు బ్యారల్‌కు 0.67 శాతం పెరిగి, 70.81 డాలర్లకు చేరడం కూడా భారత స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. సెనె్సక్స్ గణాంకాలను పరిశీలిస్తే, ఎస్ బ్యాంక్ షేర్లు అన్నిటికంటే ఎక్కువగా, 2.66 శాతం పతనమయ్యాయి. బజాజ్ ఫైనాన్స్ వాటాల ధర 2.57 శాతం పడిపోయింది. వేదాంత 2.51 శాతం, టాటా మోటార్స్ 2.48 శాతం చొప్పున నష్టపోయాయి. అదే విధంగా రిలయన్స్ 1.90 శాతం, ఎస్‌బీఐ 1.32 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.21 శాతం, హీరో మోటార్స్ 1.03 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.00 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.86 శాతం నష్టాలను చవిచూశాయి. అయితే, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇన్ఫోసిస్ షేర్లు 1.44 శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. అదే విధంగా మహీంద్ర అండ్ మహీంద్ర 1.07 శాతం, ఓఎన్‌జీసీ 1.05 శాతం, టీసీఎస్ 0.89 శాతం, పవర్‌గ్రిడ్ 0.74 శాతం చొప్పున నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈ విషయానికి వస్తే, ఇండియాబుల్స్ వాటాల ధర దారుణంగా 4.70 శాతం పతనమైంది. ఐఓసీ 4.01 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.99 శాతం, వేదాంత 2.69 శాతం, ఎస్ బ్యాంక్ 2.30 శాతం చొప్పున నష్టాలను ఎదుర్కొన్నాయి. టెక్ మహీంద్ర 1.45 శాతం, ఇన్ఫోసిస్ 1.30 శాతం, మహీంద్ర అండ్ మహీంద్ర 1.28 శాతం, టీసీఎస్ 1.24 శాతం, పవర్‌గ్రిడ్ 0.82 శాతం చొప్పున లాభాలను ఆర్జించాయి.