బిజినెస్

ఊపిరీ పీల్చుకున్న మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 9: ఈవారం మొదటి రోజు నష్టాల్లో ప్రారంబైన స్టాక్ మార్కెట్ ఊపిరి పీల్చుకుంది. సోమవారం సెనె్సక్స్ 161.70 పాయింట్లు, నిఫ్టీ 61.45 పాయింట్లు పతనంకాగా, మంగళవారం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 238.69 పాయింట్లు పెరిగి, 38,939.22 పాయింట్లకు చేరింది. అదే విధంగా జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 67.45 పాయింట్లు లాభపడి, 11,671.95 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో ట్రేడింగ్ మొలైనప్పటి నుంచి క్రమంగా పుంజుకున్న సెనె్సక్స్ మధ్యాహ్నానికి మందగించింది. ఒకానొక దశలో వరుసగా రెండో రోజు కూడా మార్కెట్ నష్టాల్లోనే ముగుస్తుందనే అనుమానం కలిగింది. అయితే, ఆతర్వాత క్రమంగా కోలుకుంది. విదేశీ మదుపరులతోపాటు, దేశీయ పెట్టుబడిదారులు కూడా సానుకూలంగా స్పందించడంతో సెనె్సక్స్ లాభాల్లో ముగిసింది. ఎస్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా 4.08 శాతం లాభాలను ఆర్జించాయి. టాటా మోటార్స్ 2.67 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.52 శాతం, బజాజ్ ఆటో 2.19 శాతం, కోల్ ఇండియా 2.12 శాతం చొప్పున లాభాలను అందుకున్నాయి. అయితే, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, ఏషియన్ పెయింట్స్ షేర్ల ధర 3.54 శాతం పతనమైంది. ఇన్ఫోసిస్ 0.95 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 0.76 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.48 శాతం, ఓఎన్‌జీసీ 0.35 శాతం నష్టపోయాయి. కాగా, నిఫ్టీ కూడా అదే విధంగా ఒక దశలో పతనమైనప్పటికీ, ఆతర్వాత కోలుకుంది. అక్కడ కూడా ఎస్ బ్యాంక్ అత్యధికంగా, 4.50 శాతం లాభాలను నమోదు చేసింది. విప్రో 4.19 శాతం, టాటా మోటార్స్ 3.22 శాతం, కోల్ ఇండియా 2.70 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.60 శాతం లాభపడ్డాయి. మరోవైపు ఇండియాబుల్స్ (3.19 శాతం), ఏషియన్ పెయింట్స్ (3.11 శాతం), భారతి ఎయిర్‌టెల్ (1.17 శాతం), ఇన్ఫోసిస్ (0.84 శాతం), యూపీఎల్ (0.64 శాతం) షేర్లు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి.
ఇలావుంటే, బీఎస్‌ఈ విడుదల చేసిన గణాంకాల ప్రకారం సోమవారం నాటి ట్రేడింగ్‌లో విదేవీ సంస్థాగత పెట్టుబడిదారులు 329.60 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. కాగా, దేశీయ మదుపరులు 623.81 కోట్ల రూపాయలు విలువ చేసే షేర్లను అమ్మారు. అమ్మకాల ఒత్తిడి పెరగడం వల్లే సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అయితే, మంగళవారం నష్టాలను భర్తీ చేసుకొని, లాభాలను ఆర్జించింది. భారత్, అమెరి కా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ వాతా వరణం త్వరలోనే కుదుటపడుతుందన్న వార్త ఒక వైపు, దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేప థ్యంలో, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే నిర్ణయాలు ఏవీ ఉండవన్న నమ్మకం మరోవైపు స్టా క్ మార్కెట్‌ను సానుకూల పరిస్థితులను తెచ్చిపెట్టా య. అంతేగాక, అంతర్జాతీయంగా వివిధ దేశాల స్టాక్ మార్కెట్ల సూచీలు కూడా క్రమంగా బలపడు తున్నాయ. ఈ అంశం కూడా భారత స్టాక్ మార్కె ట్ కోలుకోవడానికి సహకరించింది. మొత్తం మీద గత వారం ఎక్కువ భాగం లాభాల్లోనే నడిచిన మా ర్కెట్ ఈవారం మొదటి రోజునే నష్టాలను ఎదు ర్కోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. కానీ, మంగళవారం నాటి బిజినెస్ ట్రెండ్స్ మార్కెట్ పుం జుకోవడానికి ఊతమిచ్చాయి.