బిజినెస్

లక్ష ఉద్యోగాలు కల్పించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: దేశంలో సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉద్యోగాలిచ్చినట్టు ఆతిథ్య రంగంలో శర వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓయో రూమ్స్ సంస్థ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 2020 చివరి నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. ఆతిథ్య రంగానికి అనుబంధం ఉన్న అన్ని రంగాల్లోనూ టోకు కొనుగోళ్లను ప్రోత్సహిస్తూ, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపింది. దేశంలోని వివిధ నగరాల్లో ఓయో సంస్థ హోటళ్లలో గదులను తక్కువ ధరకే కిరాయికి ఇస్తున్నది. ఆయా హోటళ్లతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు తమ సేవలను విస్తరిస్తామని ఓయో తెలిపింది. భారత్‌లోనేగాక, చైనా, మలేసియా, నేపాల్, యూకే, యూఏఈ, ఇండోనేషియా, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్, జపాన్ దేశాల్లోనూ సేవలు అందిస్తున్నామని చెప్పారు. తక్కువ ధరకు మంచి సదుపాయాలు, సౌకర్యాలు ఉన్న గదులను అందిస్తున్నందువల్ల, డిమాండ్ పెరుగుతున్నదని వివరించింది. మొత్తం మీద ఈ సంస్థ 10 దేశాల్లో ఐదు వందలకుపైగా నగరాలు, పట్టణాల్లో సేవలు అందిస్తున్నది.