బిజినెస్

‘ధనుష్’కు ప్రత్యేక రకం ఉక్కు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: రెండు రోజుల క్రితం మనసైన్యం అమ్ములపొదిలోకి చేరిన పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ప్రతిష్టాత్మక ఫిరంగి ‘ధనుష్’కు అవసరమైన ప్రత్యే క రకమైన ఉక్కును తమ కర్మాగారం సరఫరా చేసిందని దేశంలో పేరెన్నికగన్న ప్రభుత్వ రంగ ఉక్కు కర్మాగారం ‘సెయిల్’ బుధవారం ఇక్కడ ప్రకటించింది. దుర్గాపూర్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ అల్లాయ్ స్టీల్ ప్లాంట్ నుంచి ప్రత్యేక తరహా పోత ఉక్కును ఇందుకోసం సరఫరా చేయ డం జరిగిందని సంస్ధ పేర్కొంది. ఈనెల 8న సైన్యానికి అందజేసిన ఈ అతిపెద్ద సైనిక ఫిరం గి తొలిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుందని, ఇందుకోసం ‘స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా’ నేతృత్వంలో ఉక్కు సరఫరా జరిగిందని కంపెనీ ఆ ప్రకటనలో వివరించిం ది. భారత రక్షణ వ్య వస్థను పటిష్టవంతం చేసే దిశగా దేశానికి అవసరమైన సేవలందించడంలో తమ కంపె నీ ఎప్పుడూ సిద్ధంగా ఉం టుందన్న విషయాన్ని మరోమారు చాటుకున్నామని సంబంధిత అధికారులు తెలిపా రు. ధనుష్‌ను జబల్‌పూర్ ఫ్యాక్టరీలో డిజైన్ చేయడంతోబాటు అక్కడే త యారు చేయడం, భారత సైన్యానికి అందజేయడం జరిగాయని వివరించారు. కాగా ఎస్‌ఏఐఎల్ (సైల్) ఉక్కు కర్మాగారానికి చెంది న ఉక్కును రక్షణ రంగంలోని వివిధ కార్యక్రమాల్లో వినియోగించడం జరిగిందని, ప్రత్యేకించి ఐఎన్‌ఎస్ విక్రాం త్, ఐఎన్‌ఎస్ ఖైతాన్, ఐఎన్‌ఎస్ కామో ర్టా, ఎంబీటీ అర్జు తదితరాల్లో ఈ ఉక్కును వినియోగించడం జరిగిందన్నారు. భారత రక్షణరంగ బలోపేతంలో భాగంగా అవసరమైన సాంకేతికాభివృద్థికి అవసరమైన ప్ర త్యేక తరహా ఉక్కును సరఫరా చేసేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని ఆ కంపెనీ చైర్మన్ అనిల్‌కుమార్ చౌదరి తెలిపారు. ఇలావుండగా సెయిల్‌లో కేంద్ర ప్రభుత్వానికి 75 శాతం వాటాలున్నాయి. ఆ కంపెనీకి చెందిన ముడి ఇనుము ఉత్పత్తి సైతం 8శాతం వృద్ధిచెంది ప్రతియేటా 16.3 మిలియన్ టన్నులకు చేరింది.