బిజినెస్

భారీ నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 10: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) బుధవారం భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈలో సెనె్సక్స్ 353.87 పాయింట్లు నష్టపోయి 38,585.35 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 87.65 పాయింట్లు నష్టపోయి, 11,584.30 పాయింట్లకు పడిపోయింది. భారత ఆర్థికాభివృద్ధి ఈ సంవత్సరానికి 7.3 శాతానికి పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్/ ఐఎంఎఫ్) చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఆరభంలో మందగొడిగా ప్రారంభమైన బీఎస్‌ఈ లావాదేవీలు ఆతర్వాత వేగంగా నష్టాల్లోకి పడిపోయాయి. ఒకానొక దశలో సెనె్సక్స్ 397 పాయింట్లు పతనమైంది. విదేశీ మదుపరులు అమ్మకాలకు ప్రాధానం ఇవ్వగా, దేశీయ పెట్టుబడిదారులు ఆదుకున్నారు. వారు కొనుగోళ్లవైపు కొంత మొగ్గు చూపడంతో, సెనె్సక్స్ పతనం 0.91 శాతం, నిఫ్టీ 0.75 శాతం నష్టాలను చవిచూశాయి. రుతుపవనాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉండకపోవచ్చన్న అనుమానాలతోపాటు, అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతున్నదన్న వార్త కూడా మదుపరులను ఆందోళనకు గురి చేసింది. వృద్ధిరేటు ఈ ఏడాది అంచనాల కంటే తక్కువగా నమోదవుతుందని ఐఎంఎఫ్ అభిప్రాయ పడింది. ఆర్బీఐ కూడా దాదాపు ఇలాంటి అనుమానాలనే వ్యక్తం చేసింది. దీనికితోడు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏడు దశల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దూకుడుగా ముందుకు వెళితే, నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు.
ఈ కారణంగానే, పెట్టుబడులకు స్టాక్ మార్కెట్ కంటే బులియన్ మార్కెట్ మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మొత్తం మీద అంతర్జాతీయ పరిణామాలను, దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను విదేశీ సంస్థాగత మదుపరులు జాగ్రత్త గమనిస్తూ, షేర్ల కొనుగోళ్లకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఫలితంగా బుధవారం స్టాక్ మార్కెట్‌కు భారీ నష్టం తప్పలేదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 2.07 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్ కంపెనీలకు చెందిన షేర్లు సగటున 3.28 శాతం నష్టాలను చవిచూశాయి. అయితే, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, కోటక్ బ్యాంక్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, మహీంద్ర అండ్ మహీంద్ర, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ షేర్లు ప్రతికూల పరిస్థితుల్లోనూ లాభాలను సంపాదించాయి. వీటి షేర్ విలువ సగటున 4.68 శాతం పెరగడం విశేషం.