బిజినెస్

భారత్‌లో వ్యాపారం విస్తరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: భారత్‌లో తమ సంస్థ వాణిజ్య కార్యకలాపాలను విస్తరించనున్నట్టు అంతర్జాతీయ ఐకేర్ (నేత్ర సంరక్షణ) దిగ్గజం ‘ఆల్కన్’ బుధవారం నాడిక్కడ పేర్కొంది. తమ వాణిజ్య విస్తరణకు, మార్కెటింగ్‌కు భారత్ కీలక క్షేత్రంగా మారుతుందని ఆ సంస్థకు చెందిన అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. 74 దేశాల్లో వాణిజ్య కర్యాకలాపాలున్న అంతర్జాతీయ పార్మాదిగ్గజం ‘నోవార్టిస్’ నుంచి విడివడిన తర్వాత మంగళవారం ఆల్కన్ ఓ స్వతంత్ర పబ్లిక్ లిస్టెడ్ సంస్థగా ఆవిర్భవించింది. భారత్‌లో స్థిరమైన, అద్భుతమైన వాణిజ్య కార్యక్రమాలను చేపట్టాలన్న లక్ష్యం ఉందని, ప్రధానంగా శస్త్ర చికిత్సలు, విజన్ కేర్, డ్రై ఐ పోర్ట్‌పోలియోల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టితో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఆల్కాన్ భారత, దక్షిణాసియా అనుబంధ విభాగానికి చెందిన జనరల్ మేనేజర్ సునిల్ వసంత్ పేర్కొన్నారు. ప్రత్యేకించి ‘స్పిన్ ఆఫ్’ను పూర్తి చేసుకున్న తర్వాత ఆల్కాన్ ప్రపంచంలోనే అతిపెద్ద నేత్ర వైద్య పరికరాల తయారీ సంస్థగా ఆవిర్భవిస్తుందని ఆయన చెప్పారు, సుమారు రెండు దశాబ్థాలుగా తమ కంపెనీ భారత్‌లోని రోగులకు నేత్ర వైద్యంలో అద్భుతమైన ఫలితాలను అందించేందుకు దోహదం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు స్వతంత్ర సంస్థగా మరింతగా వాణిజ్య విస్తరణపై దృష్టి కేంద్రీకరించేందుకు వీలు కలిగిందన్నారు. ప్రత్యేకించి పూర్తి పరిశీలనా దృక్పథంతో మరింత పరిశోధనాత్మకంగా తమ సంస్థ పురోగమిస్తుందన్నారు. వాణిజ్య కార్యకలాపాల విస్తరణకు అనుగుణంగా ఆర్థికాభివృద్థికి, పెట్టుబడుల సమీకరణకు ప్రయత్నిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.