బిజినెస్

గణనీయంగా తగ్గిన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: గడచిన మార్చి నెలలో ప్యాసింజర్ వాహనాల రీటెయిల్ విక్రయాల్లో గణనీయమైన తగ్గుదల నెలకొంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఏడీఏ) బుధవారం నాడిక్కడ ఈ మేరకు ప్రకటించింది. గత ఏడాది ఇదే నెలలో జరిగిన విక్రయాలతో పోలిస్తే సుమారు 10 శాతం విక్రయాలు తగ్గి కేవలం 2.42.708 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయని తెలిపింది. 2018 మార్చిలో 2,69.176 ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు జరిగినట్టు ఎఫ్‌ఏడీఏ వివరించింది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఏడు శాతం తగ్గిపోయి 13,24, 823కు చేరిందని, గత ఏడాది ఇదే నెలలో 14,25,356 యూనిట్ల విక్రయం జరిగింది పేర్కొంది. అలాగే వాణిజ్య వాహనాల విక్రయాల విక్రయాల్లోనూ 12 శాతం తగ్గుదల నెలకొని 70.203 నుంచి 61,82,656 యూనిట్లకు పడిపోయింది. ఇక మూడు చక్రాల వాహనాల విక్రయం 6శాతం తగ్గిపోయి 53,229కు చేరింది. మొత్త అన్ని కేటగిరీలకు చెందిన వాహనాల విక్రయం గత నెలలో 8 శాతం తగ్గిపోయి 18,21,538 నుంచి 16,82.656 యూనిట్లకు పడిపోయింది. గత ఏడాది మార్చినెలలో వాహనాల విక్రయంలో కీలకమైన అభివృద్ధి నమోదుకాగా ఈ ఏడాది నిరాశే మిగిలిందని ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు ఆశిష్ హర్షరాజ్ కాలే పేర్కొన్నారు. ఐతే నెలవారీగా చూసుకుంటే ఫిబ్రవరి కంటే మార్చిలో కొంత వరకు ఆశావహ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అవసరానికి అనుగుణంగా ఉత్పత్తిలో మార్పు చేసుకున్న వాహన తయారీ సంస్థల తీరు ప్రశంసనీయమని అన్నారు. ఏప్రిల్‌లో సైతం ఈరకమైన తగ్గుదల కొనసాగే అవకాశాలున్నాయన్నారు. సుమారు ఆరు నెలల నుంచి వాహనాల డీలర్లు సరైన వర్కింగ్ క్యాపిటల్ లేమి, ద్రవ్యలోటు వంటి కష్టాలను ఎదుర్కొన్నారని ఆశిష్ తెలిపారు. ఆటో రీటెయిల్ మార్కెట్ విభాగానికి సరైన వర్కింగ్ కేపిటల్ సమకూరేలా ప్రత్యేక విధానాన్ని తీసుకురావాల్సిందిగా రాను న్న ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. రాబోయే కాలంలో వాహనాల విక్రయంలో వృద్థి నెలకొంటుందన్న ఆశాభావంతో ఉన్నామని ఆయన చెప్పారు.