బిజినెస్

అమెరికన్ మార్కెట్లోకి లుపిన్ ‘ఫ్లుయోగ్జెటిన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: మానసిక వత్తిడిని తగ్గించే జనరిక్ ఔషధం ‘ ఫ్లుయోగ్జెటిన్’ మాత్రలను తమ కంపెనీ అమెరికన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టిందని ఔషధ తయారీ సంస్థ ‘లుపిన్’ బుధవారం నాడిక్కడ తెలిపింది. అమెరికాకు చెందిన ఆహార, ఔషధ పరిపాలనా విభాగం (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి ఆమోదం లభించిన తర్వాత తమ కంపెనీ ఈ 60 ఎంజీ మాత్రలను అక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టడం జరిగిందని ఆ కంపెనీ బుధవారం నాడిక్కడ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అల్వోజన్ గ్రూప్ హోల్డింగ్స్ 3 ఎల్‌ఎమ్‌సీ జనరిక్ వెర్షన్‌కు చెందిన తమ మాత్రమాత్రలు ఫ్లుయోగ్జెటిన్ 60 ఎమ్‌జీ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయని, ఐక్యూవీఐఏ ఏంఏటీ విడుదల చేసిన ఫిబ్రవరి నెల గణాంకాల మేరకు ఫ్లుయోగ్జెటిన్ మాత్రలు అమెరికాలో ఏడాదికి 41 మిలియన్ డాలర్ల మేర విక్రయాలు జరిగే అవకాశాలున్నాయని వెల్లడైందని లుపిన్ పేర్కొంది. అతిపెద్ద డిప్రెసివ్ డిసార్డర్లను అదుపుచేసేందుకు తమ ఔషథం బాగా పనిచేస్తుందని, బులీమియా నెర్‌వోసాతోబాటు ఆగోరాపోబియా వల్ల వచ్చే పానిక్ డిసార్డర్లకు సైతం ఇది ఉపయుక్తంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.