బిజినెస్

జెట్ ఎయిర్‌వేస్ వాటాలు 8శాతం పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 16: జెట్ ఎయిర్‌వేస్ త్వర లో తన విమాన సర్వీసుల నిర్వహణలన్నింటినీ తాత్కాలికంగా ఆపివేసే అవకాశాలున్నాయన్న కథనాలు ఆ కంపెనీ వాటాలపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపాయి. ఈ విమానయాన సంస్థ వాటాలు మం గళవారం దాదాపు 8 శాతం మేర నష్టపోయాయి. బీఎస్‌ఈలో మొత్తం 7.62 శాతం నష్టపోయిన ఈ వాటాలు ఒక్కొక్కటి రూ. 241.85 వద్ద ట్రేడయ్యా యి. అలాగే ఎన్‌ఎస్‌ఈలో సైతం 7.71 శాతం నష్టపోయి ఒక్కో వాటా ధర 241.50 వద్ద ముగిసింది. ఇక వాణిజ్య విలువ ఆధారంగా 48.67 లక్షల వాటా లు బీఎస్‌ఈలో ట్రేడవగా, ఎన్‌ఎస్‌ఈలో ఐదు కోట్ల వాటాల మేర ట్రేడయ్యాయి. అలాగే బీఎస్‌ఈలో కంపెనీ మార్కెట్ విలువ రూ. 225.65 కోట్లు కోల్పో యి మొత్తం విలువ రూ. 2,747.35 కోట్లకు పడిపోయింది. కాగా త్వరలో ఈ సంస్థ తన విమాన నిర్వహణలన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేస్తుందన్న కథనాలపై వివరణ ఇవ్వాల్సిందిగా బీఎస్‌ఈకి చెంది న అధికారులు జెట్ ఎయిర్‌వేస్‌ను వివరణ కోరా రు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న ఈ విమానయాన సంస్థ ప్రస్తుతం కేవలం 10 విమానాలను మాత్రమే నడుపుతోంది. అంతర్జాతీయ విమాన స ర్వీసుల నిర్వహణను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలో నిధుల సమీకరణకు సంస్థ యాజమా న్యం ప్రయత్నాలు సాగిస్తుండగా అసలు విమానా ల నిర్వహణను కొనసాగించాలా లేదా అన్న విషయంపై మంగళవారం తుది నిర్ణయం తీసుకునే అ వకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచా రం. 25 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ సంస్థ సీఈవో వినయ్‌దూబే సోమవారం మాట్లాడుతూ బ్యాంకు ల కన్సార్టియం అత్యవసర నిధుల కల్పనకు సం బంధించిన నిర్ణయమేదీ తీసుకోకపోవడంతో మం గళవారం సమావేశమై సంస్ధ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.