బిజినెస్

రూ. 10,500 కోట్ల వాటాలను మళ్లీ కొనుగోలు చేయనున్న విప్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఐటీ సేవల దిగ్గజం విప్రో మంగళవారం రూ. 10,500 కోట్ల విలువైన వాటాల బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. గడచిన 15 నెలల కాలంలో ఈ సంస్ధ ఇలా బైబ్యాక్ ఆఫర్‌కు వెళ్లడం ఇది రెండోసారి. 32.3 కోట్ల వాటాలను ఒక్కోవాటా ధర 325 వంతున వాటాదారుల నుంచి కొనుగోలు చేయనుంది. 2016 నుంచి విప్రో సంస్థకు ఇది మూడో బైబ్యాక్ కార్యక్రమం కావడం గమనార్హం. ఆ ఏడాది రూ. 2,500 కోట్ల కార్యక్రమాన్ని చేపట్టగా, 2017 నవంబర్-డిసెంబర్ మాసాల నడుమ రూ.11,000 కోట్ల విలువైన బైబ్యాక్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. కాగా తాజాగా మంగళవారం జరిగిన సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం మూడో దఫా బైబ్యాక్‌కు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మొత్తం 32,30,76,923 ఈక్విటీ షేర్లను రూ. 10,500 కోట్లకు మించకుండా కోనుగోలు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం జరిగింది. మొత్తం పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ కేపిటల్‌లో 5.35 శాతం మేర ఒక్కో ఈక్విటీ షేర్ ధర రూ.325కు కొనుగోలు చేయడం జరుగుతుందని ఆ సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రస్తుత వాటాదార్లు పాల్గొనేలా ఈ బైబ్యాక్‌కు సంబంధించి నిబంధనల మేరకు టెండర్‌ను నిర్వహిస్తామని సంస్థ తెలిపింది. కంపెనీకి చెందిన ప్రమోటర్,ప్రమోటర్ గ్రూప్ సభ్యులు ఇందులో పాల్గొనేందుకు లాంచనంగా అంగీకారాన్ని ఇప్పటికే తెలియజేసినట్టు పేర్కొంది. గడచిన మార్చి 31 గణాంకాల మేరకు ప్రమోటర్లకు సంస్థలో 73.85 శాతం వాటాలున్నాయి. అలాగే 6.49 శాతం వాటాలు భారత ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, మూచువల్ ఫండ్లకు ఉన్నాయి. అలాగే విదేశీ మదుపర్లకు 11.74 శాతం వాటాలున్నాయి. ఇక దేశీయంగా సాధారణ ప్రజలు, కార్పొరేట్లు 7.92 శాతం వాటాలుకలిగివున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదార్లు తమ అంగీకారాన్ని తెలియజేయాల్సివుంటుంది. దీనికి సంబంధించిన కాలవ్యవధి, నిర్వహణ ఇతర వివరాలను త్వరలో తెలియజేయడం జరుగుతుందని సంస్థ పేర్కొంది. కాగా విప్రోకు చెందిన వాటాలు బీఎస్‌ఈలో మంగళవారం 2.45 నష్టపోయి ఒక్కోవాటా ధర రూ.281.10గా పలికింది. మార్కెట్ సమయం ముగిసిపోయిన తర్వాత ఈ కంపెనీ త్రైమాసిక ఫలితాలు, బైబ్యాక్ ఆఫర్ వెలువడడంతో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయని విశే్లషకులు పేర్కొంటున్నారు.