బిజినెస్

రికార్డు స్థాయి లాభాల్లో సెనె్సక్స్, నిఫ్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 16: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ సెనె్సక్స్ మంగళవారం లాభాల పరుగుతీసింది, దాదాపు 370 పాయింట్లు ఎగబాకి రికార్డు స్థాయిలో 39,275.64 మార్కును తాకింది. ఈ ఏడాది రుతుపనాల ప్రభావం సానుకూలంగా ఉం టుందని, సాధారణ వర్షాలు కరుస్తాయని విశే్లషణలు వెలువడడం, కార్పొరేట్ కంపెనీల ఆదాయ గణాంకాలు సైతం సానుకూలంగా ఉండటం మా ర్కెట్లకు ఊతమిచ్చిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా నిఫ్టీ సైతం 97 పాయింట్లు లాభపడి సరికొత్త అధికమొత్తం 11,787.15 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో వరుసగా నాలుగో రోజు లాభా ల బాటలో నడిచిన 30 షేర్ల సెనె్సక్స్ ఇంట్రాడేలో ఒక దశలో రికార్డు మార్కు 39,364.34ను తాకింది. ప్రధానంగా ఈ సూచీల ర్యాలీలో ఫైనాన్షియల్, వినిమయ వస్తువులు, వాహన, చమురు, సహజవాయు ల రంగాలకు సంబంధించిన స్టాక్స్ లాభాల పంట పండించాయి. సెనె్సక్స్ ప్యాక్‌లో ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఎల్ అండ్ టీ, మారుతీ, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఎం అండ్ ఎం, కోటక్ బ్యాంక్, టీసీఎస్, ఆక్సిస్ బ్యాంక్ దాదాపు 3.96 శాతం అదనపులాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు ప వర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, కోల్ ఇండి యా సంస్థలు దాదాపు 0.63 శాతం నష్టపోయా యి. అంతర్జాతీయంగా సైతం మార్కెట్లకు సానుకూల వాతావరణం నెలకొందన్న విశే్లషణలు సైతం స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చిందని విశే్లషకులు భావిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో వచ్చే త్రైమాసికం లో మార్కెట్లు మంచి లాభాలను అందుకునే వీ లుందన్న విశే్లషణలతోబాటు, రుతుపవనాలు సకాలం లో వచ్చి సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ పరిశోధనా కేంద్రం అంచనాలు మదుప ర్ల సెంటిమెంటును ప్రభావితం చేయడంవల్లే మంగళవారం సూచీల ర్యాలీ జరిగిందని భావిస్తున్నారు. ఇక ఆసియా పరిధిలోని జపాన్, చైనా, కొరియా స్టాక్‌మార్కెట్లు మంగళవారం సానుకూలంగా ముగియగా, ఐరోపాలో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లలో సై తం ప్రాథమిక వాణిజ్యం లాభప్రదంగానే సాగిన ట్టు గణాంకాలు తెలిపాయి. ఇక అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 0.11 మేర తగ్గి బ్యారెల్ 71.10 డాలర్లు పలికింది. ఇక భాతర రూపాయి మారకం విలువ 24 పైసలు తగ్గి అమెరికన్ డాలర్‌తో రూ.69.67 పలికింది.