బిజినెస్

శ్రీసిటీని సందర్శించిన రష్యా వాణిజ్య రాయబారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాళెం: ఆంధ్రా తమినాడు సరిహద్దులో ఉన్న శ్రీసిటీ పారిశ్రామిక వాడను రష్యన్ ఫెడరేషన్ వాణిజ్య రాయబారి ఓలెగ్‌యన్ అవధీన్ మంగళవారం సందర్శించారు. శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. శ్రీసిటీ పారిశ్రామిక నగర విశిష్టతను, ప్రగతిని వివరించారు. శ్రీసిటీ యాజమాన్యంతో జరిగిన సమావేశంలో ఓలెగ్‌యన్‌అవధీన్ పలు ప్రశ్నలు అడిగి శ్రీసిటీ విశిష్టతను మరింతగా తెలుసుకున్నారు. శ్రీసిటీలో వ్యాపార అనుకూల వాతావరణం పట్ల ఆయన సంతృప్తి చెందుతూ పలు విజయవంతమైన పరిశ్రమలకు చిరునామాగా మారిన శ్రీసిటీ మరింత ప్రగతి సాధించిందని ఆయన తెలిపారు. అనంతరం ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ రష్యన్ రాయభారి పర్యటన, చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరింతగా పెరుగుతాయని, రాయబారి రాకలను తాము గౌరవప్రదంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

చిత్రం... శ్రీసిటీని సందర్శించిన రష్యా వాణిజ్య రాయబారి ఓలెగ్‌యన్ అవధీన్