బిజినెస్

737 మాక్స్ బోయింగ్ విమానాన్ని పరీక్షించిన ఫెడరల్ ఏవియేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 18: 737 మాక్స్ బోయింగ్ మోడల్ విమానాన్ని ఆ సంస్థ యాజమాన్యం గురువారం నాడిక్కడ చివరిసారిగా పరీక్షించింది. పూర్తిగా అప్‌డేట్ అయిన యాంటీ స్టాల్ సిస్టం ప్రాధాన్యతతో వైమానిక శాఖ అధికారుల సర్ట్ఫికేషన్‌తో ఈ విమానం రూపుదిద్దుకుందని ఆ సంస్థ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ విమానయాన తయారీ సంస్థ సీఈవో డెన్సిస్ మొయిలిన్‌బెర్గ్ గురువారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మొత్తం 120 విమానాలకు టెస్ట్ లైలెట్లను దాదాపు 203 ఎయిర్‌టైం గంటలపాటు మాన్యువరింగ్ కేరెక్టరిస్టిక్స్ ఆగ్మెంటేషన్ సిస్టం (ఎంసీఏఎస్) సాఫ్ట్‌వేర్ ద్వారా నిర్వహించినట్టు ఆయన ట్వీటారు. ఈ సిస్టంపై పరిశోధకులు జీరో ను నమోదు చేశారని వెల్లడించారు. గత అక్టోబర్, మార్చి నెలల్లో లయన్ ఎయిర్, ఇథియోపియా విమానం ఘోర ప్రమాదాలకు గురై సుమా రు 350 మంది ప్రయాణికులు మృత్యువాత పడి, ఆకాశంలో ఈ విమానాల నిర్వహణకు పలు దేశా లు స్వస్తిపలికిన నేపథ్యంలో ఈ తాజా పరీక్షల ప్రక్రియకు ప్రాధాన్యత నెలకొంది. ఇప్పుడున్న వెర్షన్ విమానం నడిపేందుకు అనువుగా ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడే అప్రూవల్‌కు వెళ్లడం లేదని ఫెడరల్ ఏవియేషన్ యాజమాన్యం స్పష్టం చేసింది.