బిజినెస్

రూపాయ మారకం విలువ పెరుగుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 20: రూపాయ మారకం విలువ పెరుగుతుందా? గతంతో పోలిస్తే మరింతగా బలప డుతుందా? ఫోరెక్స్ మార్కెట్‌నేగాక, స్టాక్ మార్కెట్‌లోనూ ఈ ప్రశ్నలు ప్రాధాన్యతను సంతరించు కున్నాయ. రూపాయ మారకం విలువ పెరిగితే, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి చూపే అవకాశం లేదు. అయతే, దేశీయ మదుపరులు ఆసక్తిని ప్రదర్శిస్తారు. మారకం విలువ తగ్గితే, ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉంటాయ. ఈవారం మార్కెట్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో, వచ్చేవారం పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయ. ఈవారం డాలర్‌కు రూపాయ విలువ 25 పైసలు పెరిగింది. దీనితో డాలర్ విలువ 69.35 రూపాయలకు చేరింది. అయతే, అంతకు ముందు అత్యధికంగా 69.61 రూపాయలు, అత్యల్పంగా 69.48 రూపాయల మధ్య ట్రేడింగ్ జరిగింది. ఈ మార్పుల ఫలితమే స్టాక్ మార్కెట్‌పై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపిందని విశే్లషకుల అభిప్రాయం. మొత్తం మీద గత వారం సెనె్సక్స్ 373.17 పాయంట్లు పెరిగింది. నిఫ్టీ 109.35 పాయంట్లు లాభపడింది. రూపాయ విలువ వారంలో 43 పైసలు లేదా 0.62 శాతం పతనమైంది. చివరిలో 25 పైసలు పెరగడం కొంత వరకూ ఫోరెక్స్ మార్కెట్‌కు ఊతమిచ్చింది. లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న కొత్త వారంలో రూపాయ మారకం విలువ ఏ విధంగా ఉంటుందనేది ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న ప్రశ్న. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇంత వరకూ 15,311.56 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. కొత్త వారంలో ఎంత ఖర్చు చేస్తారో చూడాలి.