బిజినెస్

స్టార్టప్స్‌పై కజక్ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 21: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) అమలు చేస్తున్న అంకుర పరిశ్రమల విధానాలపై కజకస్థాన్ ఆసక్తిని ప్రదర్శిస్తున్నది. ఈ విషయాన్ని బీఎస్‌ఈ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్‌లో కజక్ రాయబారి బులట్ సర్నెబయెవ్ ఇటీవలే తనను కలిసి, తమ దేశంలోనూ ఇలాంటి వేదికలు, ప్రణాళికల ఏర్పాటు, అమలుకు సహకరించాల్సిందిగా కోరినట్టు చెప్పారు. కజక్ కోరిన సాయం చేయడానికి బీఎస్‌ఈ సిద్ధంగా ఉందని, విదేశాంగ శాఖ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత, తదుపరి కార్యాచరణను ఖరారు చేస్తామని వివరించారు. కెనడాకు చెందిన రేర్సన్ యూనివర్శిటీ, సైమన్ ఫ్రేజర్ యూనివర్శిటీ సహకారంతో మూడు స్టార్టప్ ప్లాట్‌ఫామ్స్‌ను బీఎస్‌ఈ ఏర్పాటు చేసిందని చెప్పారు. స్మాల్ అండ్ మీడియం ప్లాట్‌ఫామ్ కింద సుమారు 300 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయని ఆశిష్ కుమార్ వివరించారు. ఇలాంటి అంకుర పరిశ్రమల సహాయక వేదికల ఏర్పాటుకు అవసరమైన సహకారాన్ని తాను అందిస్తామని అంటూ, విదేశాల నుంచి వచ్చే అభ్యర్థలను అంగీకరించడానికి ముందు విదేశాంగ శాఖ అనుమతి అత్యవసరమమని తెలిపారు. కాగా, భారత్ సహాయాన్ని తీసుకొని, తమ దేశంలోనూ స్టార్టప్ ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తామని భారత్‌లో కజక్ రాయబారి సర్నెబయెవ్ అన్నారు. ఇలాంటి వేదికలు, కేంద్రాల వల్ల పారిశ్రామిక రంగం శరవేగంగా ముందుకు దూసుకెళుతుందని అన్నారు. భారత్ సాధిస్తున్న ఫలితాలే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.