బిజినెస్

ఎస్‌బిఐలో ఎస్‌బిహెచ్ విలీనానికి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్)ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో విలీనం చేయాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన ఈ విషయమై తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ఎస్‌బిహెచ్‌కు ఘనమైన చరిత్ర ఉందని, నిజాం కాలం నుంచి ఈ బ్యాంకు అద్భుతమైన సేవలను అందిస్తోందని తెలిపారు. 1956 కంటే ముందు నుంచి ఈ బ్యాంకు ఉందని గుర్తుచేశారు. తెలంగాణ ఐకాన్‌గా ఉన్న ఈ బ్యాంకును ఎస్‌బిఐలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించే విషయమై ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో ఈ మేరకు ఒక తీర్మానం చేసే విషయమై కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఈటెల అన్నారు. కాగా, ఇప్పటికే ఎస్‌బిఐలో ఎస్‌బిహెచ్ విలీనంపై కేంద్రం ఆమోద ముద్రవేసిన విషయం తెలిసిందే.