బిజినెస్

నాణ్యత లేని మందులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: అమెరికా ప్రధాన కేంద్రంగా ఔషధ తయారీ వ్యాపారంలో ఉన్న టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా పాటించని రక్తపోటు మందులను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే, వీటి నాణ్యతపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమానం వ్యక్తం చేస్తూ, వాటిని వినియోగదారులకు చేరకుండా జాగ్రత్త పడాలని సూచించింది. వెంటనే స్పందించిన టోరెంట్ కంపెనీ, లొసార్టాన్ పొటాషియం టాబ్లెట్లు ఉన్న 1,33,992 సీసాలను వెనక్కు రప్పిస్తున్నది. వీటిని అమెరికాతోపాటు పోర్టారికోలోనూ అమ్మగా, ఆయా ప్రాంతాల నుంచి వాటిని వాపసు తీసుకుంటున్నది. లొసార్టాన్ పొటాషియంతోపాటు, హైడ్రోక్రోరోథియాజైడ్ టాబ్లెట్లను కూడా మార్కెట్ నుంచి రద్దు చేసింది. వాటినితో కలిపితే, వెనక్కు రప్పిస్తున్న బాటిళ్ల సంఖ్య 1,73,760కు చేరుతుంది. వినియోగదారులకు అత్యంత నాణ్యత గల మందులను విక్రయిస్తున్నామని, హైపర్‌టెన్షన్ మందుకులకు సంబంధించి, ఒక బ్యాచ్‌లో నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా పాటించలేదని యూఎస్‌ఎఫ్‌డీఏ వెంటనే నివారణ చర్యలు చేపట్టినట్టు టోరెంట్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నాణ్యతపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.