బిజినెస్

రూ. లక్ష కోట్ల చేరువలో ఆరు కంపెనీల విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: దేశంలోని 10 అతిపెద్ద కంపెనీల్లో ఆరు కంపెనీల మార్కెట్ విలువ కలిసి లక్ష కోట్ల రూపాయల మైలురాయికి చేరువవుతున్నది. స్టాక్ మార్కెట్‌లో అత్యధికంగా లాభపడిన ఈ ఆరు కంపెనీల జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మొదటి స్థానాన్ని ఆక్రమిస్తున్నది. గత వారం స్టాక్ మార్కెట్ గణాంకాలను అనుసరించి, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనీ లీవర్ (హెచ్‌యూఎల్), కోటక్ మహీంద్ర బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు భారీ లాభాల్లో ట్రేడయ్యాయి. ఫలితంగా ఈ కంపెనీల మార్కెట్ విలువ కూడా గణనీయంగా పెరిగింది. ఆరు కంపెనీల మొత్తం విలువ 98,502.47 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇందులో టీసీఎస్ విలువ 49,437.67 కోట్ల రూపాయలు పెరిగి 8,05,074.14 కోట్ల రూపాయలకు చేరింది. ఈ కంపెనీ షేర్లు 17.7 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, రిల్ మార్కెట్ విలువ 25,957.18 కోట్ల రూపాయలు మెరుగుపడి 8,76,585.81 కోట్ల రూపాయలకు ఎగబాకింది. అదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ 6,808.26 కోట్ల రూపాయలు పెరగడంతో, ప్రస్తుతం విలువ 6,23,678.06 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ 6,739.51 కోట్ల రూపాయలు మెరుగుపడడంతో 2,61,018.37 కోట్ల రూపాయలకు చేరింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ విలువ 5,966.44 కోట్లు పెరిగి, 2,62,789.40 కోట్ల రూపాయలకు వెళ్లింది. హెచ్‌యూఎల్ 3,593.41 కోట్ల రూపాయల లాభంతో 3,76,106.57 కోట్ల రూపాయలకు పెరిగింది.
ఇలావుంటే, ఇన్ఫోసిస్ మార్కెట్ విలువలో 13,740.30 కోట్ల రూపాయలు కోతపడడంతో 3,12,990.25 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఎస్‌బీఐ 3,926.83 కోట్ల రూపాయలు నష్టపోయి, 2,77,466.17 కోట్ల రూపాయలుగా నమోదైంది. హెచ్‌డీఎఫ్‌సీ 3,847.41 కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కొని, 3,44,958.84 కోట్ల రూపాయలకు పతనమైంది. ఐటీసీ మార్కెట్ విలువ 1,532.33 కోట్ల రూపాయలు తగ్గడంతో, 3,73,091.45 కోట్ల రూపాయలకు చేరింది.