బిజినెస్

పెరుగుతున్న అవసరాలు తగ్గుతున్న ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, ఏప్రిల్ 24: ముడి చమురు ధరలు పెరుగుదల కోసం హామీ ఇచ్చిన దానికంటే అధికంగానే సౌదీ అరేబియా ఉత్పత్తిలో కోత విధించిందని అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) గురువారం నాడిక్కడ పేర్కొంది. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ మేరకు ముడిచమురు ఉత్పత్తి జరగడం లేదన్న ప్రమాద సంకేతాలను ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రతినెలా చమురు మార్కెట్ స్థితిగతులపై ప్యారిస్‌కు చెందిన ఐఈఏ అధ్యయనం చేస్తుంది. కాగా ఒపెక్ దేశాల్లో ప్రాధాన్యత గల సౌదీ అరేబియా గడచిన మార్చి నాటికి రెండేళ్ల కనిష్ట స్ధాయికి తన చమురు ఉత్పత్తులను తగ్గించివేసిందని రష్యాతోబాటు మాజీ సోవియట్ రాష్ట్రాలతో కుదిరిన కార్టెల్ ఒప్పందం తర్వాత సౌదీ అరేబియా ఈ కోతలు అమలు చేస్తోందని నివేదిక తెలిపింది. అభివృద్ధి చెందిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) దేశాల్లో 2018లో చివరి మూడు నెలల్లో ముడిచమురు డిమాండ్ కన్నా రోజుకు 0.3 మిలియన్ బారెళ్ల వంతున ఉత్పత్తి తగ్గిపోయిందని అధ్యయనం వెల్లడించింది. 2014 నుంచి తీసుకుంటే త్రైమాసికంలో ఇంతగా ఉత్పత్తి తగ్గిపోవడం ఇదే తొలిసారని, ఈఏడాది తొలి త్రైమాసికంలో కూడా ఓఈసీడీ దేశాల్లో చమురు ఉత్పత్తి తగ్గే అవకాశాలున్నాయని నివేదిక అంచనా వేసింది. బ్రెగ్జిట్ కారణంగా కొన్ని ఐరోపా దేశాలు ఆర్థికంగా బలహీనపడడం ఇందుకు కారణం కావచ్చని పేర్కొంది. అలాగే చైనాతోబాటు, భారత్, అమెరికా దేశాల్లో చమురు అవసరాలు మరింతగా పెరిగాయని ఈక్రమంలో చమురు ఉత్పత్తి తగ్గిపోవడం విపరీత పరిణామాలకు దారితీసే అవకాశాలున్నాయని నివేదిక హెచ్చరించింది. అంతర్జాతీయంగా వస్తున్న మిశ్రమ ఫలితాలతో అంతర్జాతీయ చమురు మార్కెట్ మరింత సంక్లిష్టంగా మారుతోందని పేర్కొంది. ఒపెక్ దేశాల ఉత్పత్తి గత మార్చి నెలలో రోజుకు 0.55 మిలియన్ బ్యారెళ్ల వంతున తగ్గిపోయి మొత్తం ఉత్పత్తి రోజుకు 30.13 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే ఉత్పత్తి జరిగిందని ఇది నాలుగేళ్ల కనిష్ట స్ధాయి అని నివేదిక పేర్కొంది. సౌదీ అరేబియా ఉత్పత్తిలో కోతలు విధించడంతోబాటు, సంక్షోభంలో ఉన్న వెనెజులాలో సైతం ఉత్పత్తి తగ్గిపోవడం ఇందుకు కారణమైందని అధ్యయనం వెల్లడించింది. వెనెజులా అపెక్‌లో సభ్య దేశమే అయినప్పటికీ ఆదేశంలో ఉన్న రాజకీయ సంక్షోభం వల్ల ఉత్పత్తిలో కోతల నుంచి మినహాయింపు లభించింది. వియన్నా ఒప్పందం మేరకు ఇప్పటి వరకు ఒపెక్ దేశాలు 153 శాతం ఉత్పత్తిలో కోతలను అమలు చేయగా నాన్ ఒపెక్ దేశాలు సైతం 64 శాతం కోతను అమలు చేశాయి. ఈ విషయంలో రష్యామాత్రం కొంత వెనుకబడి ఉందని నివేదిక తెలిపింది. వ్యూహం మేరకు చమురు ధరల్లో పెరుగుదల వచ్చిందని బ్రెంట్ ముడిచమురు ధర గత డిసెంబర్ నుంచి బ్యారెల్ 50 డాలర్ల నుంచి ప్రస్తుతం 71 డాలర్లకు చేరుకుందని నివేదిక వివరించింది.