బిజినెస్

‘అనారక్’ వార్షికాదాయం ద్విగుణీకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: స్థిరాస్థి బ్రోకరేజ్ సంస్థ అనారాక్ గడచిన ఆర్థిక సంవత్సరంలో ద్విగుణీకృత ఆదాయాన్ని ఆర్జించింది. ఈ సంస్థ మొత్తం రూ. 188 కోట్ల వార్షికాదాయాన్ని గడించింది. వరుసగా రెండో సంవత్సరం ఇలా నిర్వహణను బలోపేతం చేసుకుని పెరిగిన నివాస గృహాల అవసరాలను అందుకుని పురోగమిస్తున్నామని కంపెనీ చైర్మన్ అనుజ్ పురి గురువారం నాడిక్కడ తెలిపారు. కొనుగోలుదారులు, వ్యవస్థీకృత బ్రోకర్ల విశ్వాసాన్ని చూరగొనడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ స్థిరాస్థి కన్సల్టెన్సీ సంస్థ జెఎల్‌ఎల్ నుంచి వైదొలిగాక 2017 ఏప్రిల్‌లో అనుజ్‌పురి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఆ ఆర్థిక సంవత్సరం (2017-18)లో రూ. 93 కోట్ల వార్షికాదాయాన్ని సంస్థ గడించింది. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ ప్లారాలాల వృద్ధి సైతం తమ సంస్థ ప్రగతికి తోడ్పడిందన్నారు. గత సంవత్సరం తమ కంపెనీకి రూ.8.5 కోట్ల లాభాలు వచ్చాయని అనుజ్‌పురి పేర్కొన్నారు.
కాగా మొత్తం వార్షికాదాయంలో హౌసింగ్ బ్రోకరేజీ ద్వారా మాత్రమే రూ. 150 కోట్లు వచ్చాయని, మిగిలింది కన్సల్టెన్సీ, హాస్పిటాలిటీ, మూలధన మార్కెట్ల ద్వారా వచ్చిందని వివరించారు.