బిజినెస్

మార్కెట్‌కు ఆటుపోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 27: ఈవారం స్టాక్ మార్కెట్ అనేక రకాలుగా ఆటుపోట్లకు గురైంది. ఒకసారి బేర్ ఆధిపత్యాన్ని కనబరిస్తే, మరోసారి బుల్ రన్ కొనసాగింది. వారం మొత్తంలో జరిగిన ఐదు రోజుల లావాదేవీల్లో సెనె్సక్స్ మూడు రోజులు పతనంకాగా, రెండు రోజులు లాభాలను నమోదు చేసింది. గతవారం సెనె్సక్స్ 39,140.28 పాయింట్ల వద్ద ముగిసింది. అదే తీరులో తొలిరోజైన సోమవారం మార్కెట్ లాభాలను ఆర్జిస్తుందని అంతా ఊహించారు. కానీ, అందుకు భిన్నం గా మొదటి రోజే మార్కెట్ నష్టాల్లో ముగిసింది. 38,645.18 పాయింట్లకు పతనమైంది. మంగళవారం సైతం అదే తీరు పునరావృతమైంది. దేశీయ మదుపరులు ఆదుకున్నప్పటికీ, సెనె్సక్స్‌కు స్వల్ప నష్టాలు తప్పలేదు. 38,564.88 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్ ఆ మర్నాడు, బుధవారం ఎవరూ ఊహించని రీతిలో ఒక్కసారిగా వేగాన్ని పుంజుకుంది. అంతర్జాతీయ సూచీలు సానుకూల ధోరణులను ప్రదర్శించిన నేపథ్యంలో, సెనె్సక్స్ 39,054.68 పాయింట్లకు చేరింది. దీనితో గురువారం నాటి మార్కెట్‌పై అంచనాలు పెరిగాయి. మదుపరులు స్టాక్ మార్కెట్‌పైపు మొగ్గుచూపుతారన్న అభిప్రాయం బలపడింది. కానీ, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి భారతపైనా తీవ్ర ప్రభావం చూపింది. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మార్కెట్ డీలాపడింది. నష్టాలను చవిచూసింది. చివరికి 323.82 పాయింట్లు పతనమై, 38,730.86 పాయింట్లకు పడిపోయింది. ఇక ట్రేడింగ్‌కు చివరి రోజైన శుక్రవారం మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రతి ఒక్కరోనూ వ్యక్తమైంది. షేర్ మార్కెట్‌లో వాటాలను కొనుగోలు చేయడం కంటే, బులియన్ మార్కెట్‌లో బంగారంపై పెట్టుబడి పెట్టడం ఉత్తమమని మదుపరులు ఒక నిర్ణయానికి వచ్చే ప్రమాదం ఉంటుందని కూడా ఆందోళనపడ్డారు. అయితే, అందరి అనుమానాలను తారుమారు చేస్తూ, సెనె్సక్స్ లాభాల బాట పట్టింది. 336.47 పాయిం ట్లు పెరిగి, 39,067.33 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం మీద వారం మొత్తంలో లావాదేవీలను పరిశీలిస్తే, లాభనష్టాలు దాదాపు సమానమేనని చెప్పాలి. వారంలో సెనె్సక్స్‌లో 12.95 పాయింట్లు పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలో తరచు మార్పులు చోటు చేసుకోవడం, రూపాయి మారకపు విలువ నిలకడగా లేకపోవడం వంటి అం శా లు కూడా భారత స్టాక్ మార్కెట్‌ను ఆటుపోట్ల కు గురి చేశాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడే వరకూ పరిస్థితి దాదాపుగా ఇదే తీరులో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.