బిజినెస్

త్వరలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖ తన ఢిల్లీ విభాగం ‘మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్’ (ఎమ్‌టీఎన్‌ఎల్) ఉద్యోగులకు త్వరలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం (వీఆర్‌ఎస్)ను ఆఫర్ చేయనుంది. ఒకవేళ ఈ ప్రతిపాదనతో టెలికాం సంస్థ ముందుకు వస్తే ఇక్కడ పనిచేసే 9,500 మంది ఉద్యోగులు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని, తద్వారా టెలికాం శాఖకు రూ. 1.080 కోట్ల వరకు జీతాల ఖర్చు ఆదా అవుతుందని సంస్థ చైర్మన్ పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఈ ప్రభుత్వ రంగ సంస్థతోబాటు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)ను పరిరక్షించేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ఇవ్వడం, ఆస్తులను ద్రవ్యరూపంలోకి మార్చడం, 4జీ స్పక్ట్రంను కేటాయించడం వంటి అంశాలను ఆ శాఖ పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించిన పునర్వవస్థీకరించిన ప్యాకేజీపై త్వరలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఈక్రమంలో ఎమ్‌టీఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్‌ను పీటీఐ వివరణ కోరింది. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రస్తుతం ఎమ్‌టీఎన్‌ఎల్‌కు వార్షిక జీతభత్యాల ఖర్చు రూ. 2,500 కోట్లు ఉందని, వీఆర్‌ఎస్ పథకం వస్తే ఈ ఖర్చు రూ. 1,080 కోట్లమేర తగ్గుతుందని అన్నారు. అంటే ఆదాయంలో కనీసం 40 నుంచి 50 శాతం ఖర్చులతో ఈ జీతభత్యాలను నిర్వహించే వీలుకలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సుమారు 19వేల మంది ఉద్యోగులు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నప్పటికీ తామ పరిశీలనలో మాత్రం సుమారు 9,500 మంది వినియోగించుకోవచ్చని తేలిందని ఆయన వివరించారు. ఐతే లే ఆఫ్‌కు సంబంధించిన ప్రతిపాదనలేవీ ప్రస్తుతం లేదని ఆయన స్పష్టం చేశారు. వీఆర్‌ఎస్ సైతం అర్హులైన ఉద్యోగుల ఐచ్చిక నిర్ణయాన్నిబట్టే వర్తింపజేయాలని భావిస్తున్నామని పుర్వార్ తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో ఉద్యోగ విరమణ చేసేవారికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని తాను భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.
గుజరాత్‌లో జరిగిన తరహాలో అయితే మొత్తం సర్వీసు పూర్తయిన ఒక్కో ఏడాదికి 35 రోజుల వేతనం వంతున, అలాగే మిగిలిన సర్వీసులో ఒక్కో ఏడాదికి 25 రోజుల వంతున జీతాన్ని ఈ పథకం కింద లెక్కించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఎమ్‌టీఎన్‌ఎల్ ఆదాయంలో 90 శాతం జీతభత్యాలకే సరిపోతోందని ఆయన చెప్పారు. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌కు 60 నుంచి 70 శాతం జీతభత్యాలకు ఖర్చవుతోందని ఆయన తెలిపారు.