బిజినెస్

ముడిచమురు రూపాయి విలువ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం ప్రధానంగా ముడిచమురు ధరలు, రూపాయి మారకం విలువపై ఆధారపడి కదలాడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కంపెనీల ఆదాయ గణాంకాలు కూడాప్రభావితం చేస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈవారం వాణిజ్య రాజధానిలో మూడే వ్యాపార దినాలు జరుగనున్నారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా సోమవారం ముంబైలో, బుధవారం మహారాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరుగనున్న కారణంగా మార్కెట్లకు సెలవుదినాలుగా ఉంటాయి. కాగా ముడిచమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మనదేశం కూడా ప్రధాన దిగుమతిదారుగా ఉన్నందున అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మన మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. అలాగే రూపాయి మారకం విలువ సైతం మార్కెట్ లాభనష్టాలను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఈ రెండు అంశాలు గత కొన్ని వారాల నుంచి మనం చూస్తున్న మన మార్కెట్ సానుకూల సెంటిమెంటును ప్రభావితం చేస్తాయని ప్రముఖ విశే్లషకుడు ముస్త్ఫానదీమ్ అభిప్రాయపడ్డారు. ఇలావుండగా దేశ ఆర్థిక స్థితిగతులు ప్రధానంగా వౌలిక వసతుల గణాంకాలు ఎలావుంటాయో చూడాల్సివుందని, అలాగే తయారీ రంగంలో పీఎంఐ గణాంకాలపై కూడా ప్రధానంగా దృష్టి నిలపాల్సివుంటుందని ఆయన చెప్పారు. అన్నింటికంటే ప్రధానం రానున్న కొన్ని దఫాల సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళి ఎలావుంటుందన్న దానిపై కూడా మదుపర్లు ప్రధానంగా దృష్టి సారించారన్నారు. కంపెనీల త్రైమాసిక ఫలితాలను సైతం మదుపర్లు గమనిస్తున్నారు. తయారీ రంగానికి సంబంధించిన పీఎంఐ గణాంకాలు ఈ వారం వెలువడాల్సి వుంది. ఇందులో వాహన రంగానికి సంబంధించిన వాటాల స్థితిగతులు నెలవారీ వాణిజ్య గణాంకాలపై ఆధారపడి ఉంటాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా పవర్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ వంటి ప్రధాన కార్పొరేట్ బ్యాంకులు ఈవారం త్రైమాసిక గణాంకాలను విడుదల చేయాల్సివుంది. నాల్గవ త్రైమాసికానికి సంబంధించిన కంపెనీల ఆర్జనలోబాటు రిజర్వు బ్యాంకు రెపోరేట్ల కోత కూడా రానున్న రోజుల్లో మార్కెట్లకు సానుకూలంగా మారే అవకాశాలున్నాయని మరో ప్రముఖ విశే్లషకుడు వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. కాగా గత శుక్రవారం బీఎస్‌ఈలో సెనె్సక్స్ ర్యాలీని కొనసాగించి 336 పాయింట్లు లాభపడి 39వేల మార్కును తిరిగి చేరుకుంది. ముడిచమురు ధరలు పెరిగాయన్న వార్తలతో ఒకదశలో పెద్ద స్థాయిల్లో వాటాల విక్రయానికి దిగిన మదుపర్లు తరువాత ముడిచమురు ధరలు బ్యారెల్‌పై 75 డాలర్లకన్నా తక్కువకు చేరాయన్న వార్తలతో మళ్లీ మార్కెట్లకు ఊతం లభించింది.