బిజినెస్

ఈటీఎఫ్ ఏర్పాటుకు కేంద్రం యత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సీపీఎస్‌ఈ వాటాల ఆధారంగా ఎక్చేంజ్ ట్రేడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను ఆంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇందుకు సంబంధించిన ప్రణాళికను అమలు చేసేందుకు విదేశీ పెట్టుబడిదారులతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంప్రదింపులు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఒక సూచీని అభివృద్ధి చేసే పనిలో కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఏఎం) తలమునకలైంది. పెట్టుబడిదారుల ఫీడ్‌బ్యాక్‌ను, నిర్ధేశిత రంగాల్లోని స్టాక్స్‌కు ఉన్న డిమాండ్ల ఆధారంగా ఈటీఎఫ్ సూచీకి రూపకల్పన జరుగుతుంది. ప్రధానంగా పెద్దమొత్తాల్లో ఉన్న విదేశీ పింఛన్ నిధులపై దృష్టి నిలిపామని వీటిని అంతర్జాతీయ ఈటీఫ్‌లో మదుపుచేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని, ఇందుకు సంబంధించి త్వరలో ఫండ్ మేనేజర్ల నియామకాన్ని చేపడతామని సంబంధిత ఉన్నతాధికారి ఆదివారం నాడిక్కడ తెలిపారు. విదేశాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో మదుపర్లు ఈటీఎఫ్‌లో పెట్టుబడుల పట్ల ఆసక్తిని కనబరచడం గ్రహించామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వానికి రెండు రకాల వాణిజ్య మారక నిధులున్నాయి. ఇందులో ఈటీఎఫ్ ఒక మ్యూచువల్ ఫండ్ పథకం తరహాలో పనిచేస్తుంది. ఇది ప్రధానంగా ప్రభుత్వానికి చెందిన కంపెనీల ఆస్తులపై నిర్వహణను పర్యవేక్షిస్తుంది. భారత్-22 ఈటీఎఫ్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆరంభించగా ఇందులో 16 కేంద్ర ప్రభుత్వ ప్రధాన వాటాలు కలిగిన పరిశ్రమలు, ఆరు రంగాలను, మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు, మరో మూడు ప్రైవేటు రంగ కంపెనీలను పొందుపర్చారని అన్నారు. ఇక సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ నిధిలో 11 కంపెనీల వాటాలున్నాయి.
ఇందులో ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్‌ఈసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ ఇండియా, ఎన్‌టీపీసీ, ఎన్‌బీసీసీ (ఇండియా), ఎన్‌ఎల్‌సీ ఇండియా, ఎస్‌జెవీఎన్ లిమిటెడ్ ఉన్నాయి. కాగా ఇప్పటికే ప్రభుత్వం రూ. 32.900 కోట్ల మొత్తాన్ని రెండు ట్రాంచేల ద్వారా భారత్-22 ఈటీఎఫ్‌కు అదనపునిధుల సమీకరణను పూర్తి చేసింది. అలాగే సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌కు దేశీయ మార్కెట్‌లో ఐదు ట్రాంచేల ద్వారా రూ. 38వేల కోట్లను సమీకరించింది. ఈక్రమంలో సీపీఎస్‌ఈ నుంచి పెట్టుబడులు వెనక్కు తీసుకోవడం (డిసినె్వస్ట్‌మెంట్) ద్వారా రూ. ఈ ఏడాది 90 వేల కోట్లు సమీకరించాలని బడ్జెట్‌లో పొందుపరిన కేంద్ర ప్రభుత్వం 2018-19 సంవత్సరంలో రూ. 85వేల కోట్లు సమీకరించగలిగింది.