బిజినెస్

ఆర్జనలో రవాణా శాఖ కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు ఆదాయం తెచ్చే శాఖల్లో రవాణా శాఖ అత్యంత కీలకమైంది. ఈ శాఖ ద్వారా 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్ల ఆదాయం సాధించాలని రాష్ట్రప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, అనేక కారణాల వల్ల రవాణా శాఖ కేవలం రూ. 3504.88 కోట్లను ఆర్జించింది. లక్ష్యం కంటే రూ. 500 కోట్లు తక్కువగా ఆదాయం వచ్చినప్పటికీ, పరిస్థితి మెరుగ్గా ఉందనే చెప్పాలి. 2017-18లో రవాణా శాఖ రూ. 3228.37 కోట్ల ఆదాయం సాధించింది. అంటే 2017-18తో పోల్చితే రూ. 281 కోట్ల ఆదాయం ఎక్కువ ఆర్జించినా, లక్ష్యం మేరకు ఆదాయం సేకరించడంలో ఆశించిన ప్రగతిని రవాణా శాఖ సాధించలేకపోయింది.
రవాణాశాఖ లైఫ్ ట్యాక్స్, త్రైమాసిక పన్నులు, ఫీజులు, సర్వీసు చార్జీలు, డెటెక్షన్ చార్జీల ద్వారా ఆదాయం వస్తుంది. గత మార్చి నెలలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో లైఫ్ ట్యాక్స్ ద్వారా రూ. 2332.83 కోట్లు, క్వార్టర్లీ పన్ను ద్వారా రూ.417కోట్లు, ఫీజుల ద్వారా రూ. 441.28 కోట్లు, సర్వీసు చార్జీల ద్వారా రూ. 122.26 కోట్లు, డెటెక్షన్ చార్జీల ద్వారా రూ. 191.14 కోట్లు కలిపి రూ. 3504.88 కోట్ల ఆదాయం వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత గత ఐదేళ్లలో రవాణా శాఖ ఆదాయం దాదాపు రెట్టింపు అయిందని చెప్పవచ్చును. 2014-15లో రూ. 1854.48 కోట్లు, 2015-16లో రూ. 2215.19 కోట్లు, 2016-17లో రూ.2721.26 కోట్లు, 2017-18లో రూ. 3228.37 కోట్లు, 2018-19లో రూ.3504 కోట్లు వచ్చింది. రవాణా శాఖకు ఆదాయం లైఫ్ ట్యాక్స్ ద్వారా ఎక్కువ వస్తుంది. మొత్తం ఆదాయంలో లైఫ్ ట్యాక్స్ వాటా 70 శాతం ఉంటుంది. 2017-18లో లైఫ్ ట్యాక్స్ ఆదాయం రూ. 2087 కోట్లు వచ్చింది. గత ఏడాది రూ. 2332 కోట్లు వచ్చింది. వాస్తవానికి లైఫ్ ట్యాక్స్ ద్వారా రూ. 2678 కోట్లు ఆదాయాన్ని సాధించాలని రవాణా శాఖ లక్ష్యంగాపెట్టుకుంది. రూ.245 కోట్ల మేర ఆదాయం పెరిగినా, లక్ష్యం మేర ఈ పన్నును రవాణా శాఖ సేకరించలేకపోయింది. నిర్దేశించిన దాని కంటే రూ. 346 కోట్ల ఆదాయం తక్కువ వచ్చినట్లు రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. గత ఏడాది క్వార్టర్లీ ట్యాక్స్‌ను రూ.482 కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ. 417 కోట్లు వచ్చాయి. అంటే దాదాపు రూ.65 కోట్ల ఆదాయం లక్ష్యం కంటే తక్కువగా వచ్చింది.