బిజినెస్

పెరిగిన పసిడి, వెండి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.30 పెరిగి మొత్తం ధర రూ.33 వేలకు చేరింది. అక్షయ తృతియ పర్వదినం సమీపిస్తుండడంతో వ్యాపారుల నుంచి బంగారానికి డిమాండ్ పెరిగిందని అఖిల భారత సరాఫా అసోసియేషన్ తెలిపింది. అలాగే వెండి సైతం కిలోపై రూ.250 పెరిగి మొత్తం ధర 38,700కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల మార్కెట్ నుంచి పెరిగిన డిమాండ్‌తోనే వెండి థరలు ఇలా ఆధిక్యతను నమోదు చేశాయని వ్యాపారవర్గాలు చెప్పాయి. అంతర్జాతీయంగా ఇందుకు దేశీయంగా నెలకొన్న డిమాండే కారణం. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ బంగారం ధరలు తగ్గి ఔన్సు 1,283.50 డాలర్ల దిగువన ట్రేడవుతోంది. అలాగే వెండి ధర సైతం న్యూయార్క్ మార్కెట్లో ఔన్సుపై 15.05 డాలర్లు తగ్గింది. కాగా గడచిన శనివారం బంగారం ధరలు మనదేశీయ మార్కెట్‌లో తులంపై రూ. 50 తగ్గి మొత్తం ధర రూ.32,970కి దిగివచ్చింది. ఇవావుండగా ఎనిమిది గ్రాముల సవరం బంగారం ధరలు మాత్రం స్థిరత్వాన్ని నమోదు చేయడం గమనార్హం. సవరం బంగారం ధర రూ. 26,400 పలికింది.